“Chubby Bujjima” vidyullekha gets into trouble in Vienna, Indian Embassy helps her out

Vidyullekha khan gets into trouble in vienna

Tamil actress, vidyu lekha khan, bag theft, passport, cards, currency, Vienna, sushma swaraj, narendra modi, PMO, indian embassy, Vidyullekha temporary travel permit, Eto Vellipoindi Manasu, Ramayya Vastavayya, Bhale Manchi Roju, Rajugari Gadhi.

Chubby character artiste Vidyullekha Raman got into the trouble abroad after her bag and her passport were stolen during her foreign trip to Austria with her friends.

‘‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే’’ చిక్కుల్లో ‘బుజ్జిమా’

Posted: 05/04/2016 05:28 PM IST
Vidyullekha khan gets into trouble in vienna

తమిళ నటి విద్యుల్లేఖ రామన్ తెలుసా..? అదేంటి అలా అడుగుతున్నారు.. అనే వాళ్లు కొందరైతే.. అవిడెవరు అనే వాళ్లు మరికోందరు. బన్నీ మూవీ సరైనోడులో... సాంబారు చబ్బీ బ్యూటీ,  రాజుగారి గది చిత్రంలో బుజ్జిమాగా ఆకట్టుకున్న నటి విద్యల్లేఖ, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విద్యుల్లేఖ అయ్యయో చేతిలో డబ్బలు పోయనే.. అయ్యయో చేతులు ఖాళీ అయనే అని పాటను అలపిస్తుంది, అదేంటి ఏ చిత్రంలో ఈ పాటపై విద్యుపై చిత్రీకరిస్తున్నారనేగా మీ డౌట్,..? కానీ అది అసలు విషయమే కాదు, విదేశంలో చిక్కుల్లో పడ్డారు.
 
అమె నిజంగానే విదేశాలలో తన డబ్బును, కార్డులను, పాస్ పోర్టులను పోగోట్టుకుని కష్టాలు పడ్డారు, స్నేహితులతో కలసి ఇటీవల ఆస్ట్రయాలోని వియన్నా పర్యటనకు వెళ్లిన ఆమె బ్యాగ్ చోరీకి గురైంది. దీంతో అందుబాటులో వున్న సోషల్ మీడియాను అనుసంధానం చేసుకుని అమె చిక్కుల్లోంచి బయటపడ్డారు, తనకు సాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రిత్వ శాఖను, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను   ట్విట్టర్ లో వేడుకున్నారు.  వియన్నా సందర్శన తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందనీ, డబ్బు, పాస్ పోర్ట్ , ఇంకా విలువైన వస్తువులను కోల్పోయానంటూ ట్విట్టర్ లో  వాపోయింది.  

నిస్సహాయ స్థితిలో ఉన్న తనను  ఆదుకోవాల్సిందిగా వరుస ట్వీట్ల  ద్వారా అభ్యర్థించారు. సీనియర్‌ నటుడు మోహన్‌ రామన్‌ కుమార్తె అయిన విద్యు  .. వియన్నాలో తాను ఉన్నహోటల్‌ లాబీలో ఎవరో తన బ్యాగును దొంగిలించారని   అందులో తన పాస్‌పోర్ట్‌, కార్డులు, డబ్బు.. తదితరాలు ఉన్నాయంటూ ట్విట్ చేశారు. ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి అడ్రస్‌ ఏంటని అడుగుతూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడని ఈ లోపుగా మరో వ్యక్తి వచ్చి బ్యాగును దొంగిలించాడని చెప్పారు.  హోటల్‌లోని సీసీటీవీ పుటేజ్ ను పరిశీలించడానికి  హోటల్‌ యాజమాన్యం సమ్మతించడంలేదని ఆరోపించారు.  

దీంతో చెన్నైలోని ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. ప్రభుత్వం సహకరించి తమ కుమార్తెను స్వదేశానికి రప్పించాలని కోరారు. అమె అభ్యర్థనను అర్థం చేసుకున్న విదేశాంగ శాఖ అదేశాల మేరకు వియన్నాలోని ఇండియన్ అంబసి తాత్కాలిక ట్రావెల్ పర్మిట్ ను అందజేసింది, దీంతో బుజ్జిమా కష్టాలు తీరి ఇండియాకు పయనం అయ్యింది, కాగా తమిళ, తెలుగు చిత్రాల్లో ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారిన విద్యుల్లేఖా రామన్ 'ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా'  భలే మంచి రోజు'  తదితర చిత్రాలలో  ప్రేక్షకులను  మెప్పించారు.  అనంతం ఈ బొద్దుగుమ్మ రాజుగారి గది సినిమాలోని హాస్య పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil actress  vidyu lekha khan  vienna  austria  Indian embassy  sushma swaraj  

Other Articles