అతి పెద్ద జాతీయ పతాకం హైదరాబాద్ లో | Largest, tallest national flag to be hoisted in Hyderabad

Largest tallest national flag to be hoisted in hyderabad

Hyderabad, Flag, national Flag, Biggest national Flag, హైదరాబాద్, జాతీయ పతాకం, అతి పెద్ద జాతీయ జెండా

India's largest national flag on the tallest flag-post will be hoisted on the banks of Hussain Sagar lake in Hyderabad. Telangana Chief Minister K. Chandrasekhar Rao on Tuesday directed the officials to make arrangements for installing a 301 feet tall pole at Batukamma Ghat on the banks of the lake.

అతిపెద్ద జాతీయపతాకం హైదరాబాద్ లో

Posted: 05/04/2016 09:00 AM IST
Largest tallest national flag to be hoisted in hyderabad

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో రికార్డు సృష్టించడానికి సిద్ధమౌతుంది. దేశంలోకెల్లా అతిపెద్ద, ఎత్తైన జాతీయ పతాకాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆయన ఆదేశించారు. 301 అడుగుల ఎత్తులో ఈ పతాకం ఉండాలని, అందుకనుగుణంగా పోల్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

ప్రస్తుతం జార్ఘండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తైన పోల్, అంతకంటే పెద్ద జెండా తెలంగాణలో ఎగరవేయాలని అన్నారు. పౌరుల్లో జాతీయ భావనను పెంచడానికి ఈ చర్య దోహదపడుతుందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే హైదరాబాద్ కీ షాన్ అందరికి తెలిసిందే.. మరి ఇప్పుడు మరో మణిహారం హైదరాబాద్ కు చేరుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles