Seven Indian Shuttlers Set to Qualify for Rio Olympics

Seven shuttlers qualify for rio olympics

Sumeeth Reddy,Saina Nehwal,Rio Olympics,PV Sindhu,Parupalli Kashyap,Olympic qualification,Manu Attri,Kidambi Srikanth,Jwala Gutta,Badminton, Gutta Jwala, shuttler, Rio Olympics, tatto,

Jwala Gutta and Ashwini Ponnappa, who had represented India at the London Games, will play their second Olympics in women's doubles competition

రియో ఒలంపిక్స్ కు అర్హత సాధించిన భారత షెట్లర్లు..

Posted: 05/03/2016 08:24 PM IST
Seven shuttlers qualify for rio olympics

త్వరలో బ్రెజిల్లో జరుగనున్న రియో ఒలింపిక్స్ కు ఏడుగురు భారత షట్లర్లు అర్హత సాధించారు. ఏడుగురు షట్లర్లు ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అంతకుముందు లండన్ ఒలింపిక్స్లో భారత్ తరపున అత్యధికంగా ఐదుగురు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పాల్గొన్నారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఆదివారం ముగియడంతో రియోకు అర్హత సాధించిన షట్లర్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అందులో ఇద్దరు మహిళా సింగిల్స్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పివి సింధులు ఉన్నారు.

కాగా, పురుషుల సింగిల్స్ నుంచి కిడాంబి శ్రీకాంత్ అర్హత సాధించాడు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్ప జోడీ అర్హత పొందగా, పురుషుల డబుల్స్ విభాగంలో మను అత్రి, సుమీత్ రెడ్డిలు స్థానం పొందారు. కాగా, గాయం కారణంగా ఆసియాకప్ కు దూరమైన భారత స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ రియోకు అర్హత పొందలేదు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆనందంలో వీపుపై ఉన్న ఒలింపిక్ టాటూ కనిపించే ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు గుత్తా జ్వాల.

అన్ని విధాల ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 'మనం సాధించాం..' అంటూ తన జోడి అశ్విని పొన్నప్పకు అభినందనలు తెలిపారు. డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతోపాటు మొత్తం ఏడుగురు షట్లర్ల ఒలింపిక్ బెర్త్ లు మంగళవారం ఖరారయ్యాయి. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, మను ఆత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ర్యాంకుల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ గా భావించిన ఏసియన్ బ్యాడ్మింటర్ చాపియన్ షిప్ పోటీలు ముగిసిన తర్వాత ర్యాంకులను బట్టి షట్లర్లను ఎంపిక చేశారు. ర్యాంకులు మే 5న అధికారికంగా ప్రకటిస్తారు.

టాటూ కహానీ ఇదే..
భారత స్టార్ షెట్లర్ గుత్తా జ్వాల ఎన్నటికీ మర్చిపోలేని పోటీలు.. 2012 లండన్ ఒలింపిక్స్. ఆ వేదికపై బ్యాడ్మింటర్ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించింది జ్వాల. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్  రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ బెర్త్ పొందిన మొదటి షట్లర్ ఆమె. అందుకే 2012 ఒలింపిక్ గుర్తును వీపుపై పచ్చబొట్టు పొడిపించుకుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : badminton  rio olympics  saina nehwal  Gutta Jwala  shuttler  Rio Olympics  tatto  

Other Articles