బాలీవుడ్ లోనే అమె టాప్ మోస్ట్ హీరోయిన్. అమెకున్న ఫాలోవర్లు కాడా అశామాషీ సంఖ్యలో లేరు. అయితే అంతటి టాప్ హీరోయిన్ తో వీదుల్లో వ్యాపారం చేసే ఓ సర్వసాధారణమైన వ్యక్తి పోటీ పడుతున్నాడు. అదేం చిత్రం హీరోయిన్ తో వీధుల్లో పండ్లమ్ముకునే చిరు వ్యాపారి పోటీ పడటం ఏంటంటరా..? అవునండీ చిత్రమే కానీ యదార్థం కూడా లేకపోలేదు. అసలు వీరిద్దరి మద్య పోటీకి వచ్చిన అంశం తెలిస్తే మీరు కూడా ముందుగా నవ్వుకుంటారు. ఆనక అలోచనలో పడతారు. ఔరా.. వ్యాపారి పోటీ పడటంలో తప్పం లేదేంటారు.
మరోలా అలోచించే వారు కూడా లేకపోలేరు, ఎంతైన తమ హీరోయిన్ చెప్పిందే నిజమని వాదించేవారు లేకపోలేరు. అంతలేసి పెద్ద కంపెనీలు రసాయనాలను ఎందుకు కలుపుతాయని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు, అయితే ఇటీవల నెస్ట్లీ కంపెనీ అదే తరహాలో భారత్ లో నిషేధానికి గురై ఆ తరువాత పలు పరీక్షలలో ఫెయిల్ అయ్యి.. ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అందుకనే హీరోయిన్ కన్న పండ్ల వ్యాపారి చెప్పే విషయంలో నిజముందని భావవించే వారు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అదెలా అంటారా.?
నిద్రపోని నగరం ముంబైలో అడుగుకో మనిషి. మనిషి మనిషికో జీవితం. దానికో చరిత్ర. వాటిలో ఉత్తమమైనవాటిని పాఠకులకు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకుంది 'హ్యూమన్స్ ఆఫ్ ముంబై' ఫేస్ బుక్ పేజ్. 24 గంటల కిందట ఆ పేజ్ లో ఓ మామిడిపండ్ల వ్యాపారి మనోగతాన్ని ప్రచురించారు. కథనంలో వ్యాపారి మనోగతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యాపారి కత్రినా కైఫ్ తన వ్యాపారాన్ని అడుకుంటుందని అంటున్నారు. అదెలా అంటారా..? ఆయన మాట్లల్లోనే..
'ఫుట్ పాత్ మీద మామిడి పండ్లు అమ్ముకోవడమే నా జీవనాధారం. నేనే కాదు తరతరాలుగా మా కుటుంబం ఇదే వృత్తిలో కొనసాగుతోంది. అయితే అప్పటితో పోల్చుకుంటే మా పరిస్థితి దారుణంగా దిగజారింది. అదేం విచిత్రమో జనం ఇప్పుడు మా దగ్గర మామిడిపండ్లు కొనట్లేదు. హీరోయిన్ కత్రినా కైఫ్ టీవీల్లో చూపించినట్లు.. బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. బాటిళ్లలోని కెమికల్ రసాలతో పోల్చుకుంటే మా దగ్గర దొరికే తాజా మామిడి పండ్లే మంచివి. కానీ ఇది వ్యాపారం. వ్యాపారమన్నాక పోటీ తప్పదు. ఒకప్పుడు వ్యాపారికి, వ్యాపారికి మధ్య పోటీ ఉండేది. ఇప్పుడది విచిత్రంగా మారిపోయింది. నా వరకైతే నా ప్రధాన పోటీదారు కత్రినా కైఫే. ఆమె సరుకుల అమ్మకాలు తగ్గితేనే నాకు లాభం దొరుకుతుంది' అంటూ టాప్ హీరోయిన్ తో పోటీపడుతున్నట్లు వెల్లడిస్తాడు వీధి వ్యాపారి.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more