నావిక్ తో GPSకు ఎంత లాభం అంటే.. | Indian got GPS revolution throug NAVIK

Indian got gps revolution throug navik

Navik, GPS, Indian Space Centre, satellite navigation system, జిపిఎస్, ఇండియా, నావిక్

India yesterday took the final step towards completing its own satellite navigation system, a development heralded by the prime minister as making the nation self-reliant in the field of space-based positioning.

నావిక్ తో GPSకు ఎంత లాభం అంటే..

Posted: 04/29/2016 11:16 AM IST
Indian got gps revolution throug navik

పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో భారత్ తిరుగులేని శక్తి, ఐఆర్ఎన్ఎస్ వ్యవస్థల్లో అదిరిపోయే ట్రాక్ రికార్డ్... వీటితో పోల్చినప్పుడు నావిగేషన్ మిషన్ పరిపూర్ణంకావడం కోసం చేసిన పీఎస్ఎల్వీ సీ-33 విజయవంతమవడం పెద్ద గొప్ప విషయమేం కాదు. కానీ జీపీఎస్ వ్యవస్థల నిర్మాణంలో చేపట్టిన తుది ప్రయోగం ఐఆర్ఎన్ఎస్ఎస్-1జి ప్రయోగం మైలురాయి. అనుకున్నట్టే జీపీఎస్ క్లబ్ లో భారత్ చేరిపోయింది. ఈ వ్యవస్థలు ఉన్న అయిదో దేశం మనదే... నావిక్ అంటే నేవిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్ అని. ఇది అంతరిక్ష విజయాల్లో అద్భుతమే. భారత్ లో జీపిఎస్ లో కొత్త విప్లవం మొదలుకానుంది.

జీపీఎస్ వ్యవస్థల కోసం ఇప్పటివరకు మనం విదేశాలపై ఆధారపడ్డాం. చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ నుంచి కారుల్లో ఉండే డైరెక్షన్ బాక్స్ వరకు అన్నిటికీ మనకు తెలీకుండానే ఫీజులు చెల్లిస్తూ పోయాం. ఇప్పుడు ఆభారం తగ్గిపోనుంది. వాస్తవానికి ఆసియా దేశాల్లో మన జీపీఎస్ కు మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉంది. వైమానిక, భూగర్భ అధ్యయనాల్లో నావిక్ ఆసియాకు దిక్సూచిగా మారనుంది. సముద్ర సంపదలు, విపత్తు సూచనలు ముందుగా పసిగట్టే వ్యవస్థలు శాస్త్రవేత్తలు ఇందులో పొందుపరిచారు. రోడ్డుపై తిరిగే వాహనాల నుంచి రైళ్లు, నౌకలు, విమానాల వరకు అన్నిటికీ నావిక్ దిశానిర్ధేశం చేయనుంది. అదికూడా అతి తక్కువ ఖర్చుతో... అందుకే ఈ ప్రయోగం ఇస్రోకి ప్రధాన ఆర్థిక వనరుగా మారునుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles