President's Rule in Uttarakhand to continue, rules Supreme Court

President s rule to continue in uttarakhand

Uttarakhand,Uttarakhand Supreme Court,Harish Rawat,PM Narendra Modi,Centre Uttarakhand,Congress,Parliament

Uttarakhand will remain under President's Rule for now, the Supreme Court said today, keeping status quo until it takes a final decision.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన కోనసాగింపు.. 29 విశ్వాసపరీక్షకు బ్రేక్..

Posted: 04/27/2016 07:27 PM IST
President s rule to continue in uttarakhand

ఉత్తరాఖండ్లో రాజకీయాలు శరవేగంగా కదులుతున్నాయి, ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ నెల 29న అసెంబ్లీలో హరీష్ రావత్ బలపరీక్ష రద్దు అయింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం మే 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.

రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, దానిని విచారించిన న్యాయస్థానం ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను పోడగిస్తూ స్టే విధించింది. అయితే అంతకు ముందు ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు మొత్తం ఏడు రకాల ప్రశ్నలను సంధించింది. వాటికి సమాధానాలను చెప్పాలని సూచించింది.

ఉత్తరాఖండ్ లో సభలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఆర్టికల్ 175 (2) గవర్నర్ చెప్పారా? ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడమే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడానికి కారణమా? అసెంబ్లీలో జరిగిన పరిణామాలే రాష్ట్రపతి పాలనకు దారి తీశాయా? ద్రవ్ వినిమయ బిల్లు సందర్భంగా జరిగిన పరిణామాలు రాష్ట్రపతి పాలనకు కారణాల్లో ఒకటా? విశ్వాస పరీక్ష ఆలస్యం కావడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీసిందా? ఉత్తరాఖండ్ సీఎస్కు ప్రస్తుత పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని  న్యాయస్థానం స్పష్టం చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles