MP ShivaPrasad as Sardar Dabba Rayudu

Mp shivaprasad as sardar dabba rayudu

Shivaprasad, AP, Special Status, MP Shivaprasad, Parliament, Funds, Shivaprasad at parliament, శివప్రసాద్, ఫార్లమెంట్

MP Shiva Prasad play as Kucheludu, narada and many more characters at parliament house. But he did not speak even single word in Parliament.

సర్దార్ డబ్బారాయుడు

Posted: 04/26/2016 10:15 AM IST
Mp shivaprasad as sardar dabba rayudu

పాత కాలంనాటి ఓ సామెత గుర్తుకు వస్తోంది... మంత్రాలకు చింతకాయలు రాలతాయా..? అని. చాలా మంది చేయాల్సింది చెయ్యకుండా పనికిరానిది.. పనికిమాలినవి చేస్తూ ఫలితం కోసం మాత్రం ఎదురు చూస్తారు. ఏపిలో చాలా మంది చేస్తున్నది కూడా ఇదే. అసలు ఎక్కడ ఏం అడగాలో తెలియదు కానీ అనవసరమైన చోట మాత్రం అరచిగోళ చేస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు అని వేమన ఏనాడో చెప్పాడు అని కూడా మన ఏపి నాయకులకు మాత్రం అది పట్టడం లేదు. మరీ ముఖ్యంగా మన ఎంపీ శివప్రసాద్ కు ఇది బాగా వర్థిస్తుంది. అయ్యావార్ల వేషాలు ఏంటో ఒక్కసారి చూడండి.

చిత్తూరు ఎంపీ శివప్రసాద్.. సినిమా నేపథ్యం, నాటకాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. అయ్యవార్లు పార్లమెంట్ భవనం ముందు వేసే వేషాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల వేషధారణలతో కనిపిస్తారు మా చంద్రబాబు బాగా కష్టపడుతున్నాడు కానీ కేంద్రం నుండి మాత్రం నిధులు రావడం లేదని చెబుతారు. ఓసారి కొరడా పట్టుకొని వస్తారు... ఒళ్లు వాచిపోయేలా కొట్టుకుంటారు.. మళ్లీ అదే పాత పాటపాడతారు. మోదీని కృష్ణుడిగా చేస్తారు. తాను కుచేలుడిగా మారతారు.. కరుణించవా స్వామి అంటూ నాలుగు లైన్లు పాడి, మీడియాకు ఫోజులిచ్చి వెళ్లిపోతారు.

శివప్రసాద్ గారు పార్లమెంట్ ముందు వేసే చిందులు, వేషాల ముందు నాటకాలు ఆడే వాళ్లు కూడా పనికిరారు. అయ్యగారు చాలా జాగ్రత్తగా పనికానిచ్చేస్తారు. పార్లమెంట్ లో ఎవరూ లేనప్పుడు ముఖ్యంగా మోదీ, కేంద్ర మంత్రులు లేని సమయంలో ఫుల్ ప్రిపేర్ గా అక్కడికి చేరుకుంటారు. అంతకంటే ముందే తెలుగు మీడియా ఛానల్లకు పోన్లు వస్తాయి.. సార్ రాకముందే మీడియా అక్కడికి చేరుకునేలా ప్లాన్ వేస్తారు. మీడియా సిద్దంగా ఉన్న తర్వాత శివప్రసాద్ గారు ఎంట్రీ ఇస్తారు. తనలో ఉన్న కళాపోషణ మొత్తం బయటపెడతారు.

నిజానికి కేంద్రం నుండి ఏపికి నిధులు రావడం లేదు.. ఏపికి ఎప్పటికప్పుడు మొండి చేయి చూపిస్తోంది మరి అందుకే శివప్రసాద్ లాంటి ఉత్తమ ఎంపీగారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పార్లమెంట్ ముందు ఇలా చేస్తారు. నిలదీయాల్సిన ఎంపీగారు నిరసనలు చేస్తూ తన అసలు ట్యాలెంట్ ను చూపిస్తుంటారు. స్వామి కార్యం స్వకార్యం రెండూ కావడం అంటే ఇదేనేమో మరి. ఇటు ఏపి కోసం నిరసన చేస్తున్నట్లూ ఉంటుంది.. అటు తన సినిమా కళను ప్రదర్శించినట్లూ ఉంటుంది.

నిజంగా శివప్రాసాద్ గారికి చిత్తశుద్ది ఉంటే మరికొంత మంది ఎంపీలను పోగేసి మోదీ దగ్గరికి, అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్లాలి. అక్కడికి వెళ్లి అయ్యా మా పరిస్థితి ఇది అని నిలదీయాలి. అంతేకానీ పార్లమెంట్ ముందు చిల్లర వేషాలు వేస్తాం.. మీడియా ముందు బిల్డప్ ఇస్తామంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది. అయినా శివప్రసాద్ లాంటి సీనియర్లకు తెలియనిది ఏముంది.. మంత్రాలకు చింతకాయలు రాలతాయా.. వేషాలకు నిధులు రాలతాయా...?

అయినా రాష్ట్రానికి మంచి చెయ్యాలని అనుకున్న వాళ్లు ఇలా డబ్బాకొట్టుకుంటారా..? సైలెంట్ గా పనికానిచ్చేస్తారా..? మరి ఇప్పటి దాకా శివప్రసాద్ కనీసం పార్లమెంట్ లో మాట్లాడారా..? ప్రత్యేక హోదా నుండి పోలవరం వరకు ఉన్న ఎన్నో సమస్యల్లో ఏ ఒక్క సమస్య మీదైనా కానీ ఆయన స్పందించి.. కేంద్రాన్ని నిలదీసి ఉండవచ్చు కదా. కానీ అలా ఎందుకు చెయ్యలేదు. అప్పుడప్పుడు మీడియాలో కనిపించేలా శివప్రసాద్ వేషాలు తప్పితే మిలిగిన సమయాల్లో ఎక్కడా ఎందుకు కనిపించరు.? ఇదంతా చంద్రబాబు నాయుడు దగ్గరి నుండి నేర్చుకున్న మీడియా మేపేజ్ మెంటేనా..?

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles