రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు | Over two lakh new Central government jobs by 2017

Over two lakh new central government jobs by 2017

Jobs, Govt Jobs, 2Lakh Jobs, ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

In a good news for people seeking government jobs, over two lakh posts are estimated to be created by the Central government in its various departments.The Central government has projected in the budget estimates for 2016-17 an increase of about 2.18 lakh in the existing workforce of 33.05 lakh, as in 2015, by 2017.

రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు

Posted: 04/26/2016 08:53 AM IST
Over two lakh new central government jobs by 2017

సర్కారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వపు వివిధ విభాగాలో ఈ ఆర్థిక సంవత్సరంలో (2017 నాటికి) దాదాపు రెండు లక్షల వరకు కొత్త కొలువులు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవలి బడ్జెట్‌ అంచనాలలో సర్కారు ఈ ఏడాది కొత్తగా 2.18 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలపింది. ఇప్పటికే 33.05 లక్షల మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వపు గొడుగు కింద పనిచేస్తున్నారు. 2017లో కొత్తగా హోంశాఖలో 5,635 కొలువులు, పోలీసు శాఖలో 47,264 ఉద్యోగాలు, రక్షణ మంత్రుత్వ శాఖలో 10,894 కొలువులు, పౌర విమానయాన శాఖలో 1,080 పోస్టులు అందుబాటులోకి రానున్నట్లు బడ్జెట్‌ అంచనాలలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. కొత్త కొలువుల రాకతో పోలీసు బలగాల సంఖ్య ఇప్పుడున్న 10,28,077 నుంచి 10,75,341కి చేరనుంది. మరోవైపు రక్షణ శాఖ నిర్వహణ మానవ బలం కూడా 51,084కు పెరగనుంది.

కేంద్ర ప్రభుత్వ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరం మేరకు.. కొత్త కొలువులను సృష్టించాలని నిర్ణయించినట్లుగా పబ్లిక్‌ గ్రీవియెన్స్‌, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎక్కెడెక్కడ కొత్తగా ఉద్యోగులు అవసరమో దానిని పరిగణనలోకి తీసుకొని కొత్త పోస్టులను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు గాను కొత్త ఉద్యోగాల కల్పన ఎంతగానో దోహదం చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles