కొడుకు లవ్ తండ్రి ప్రాణం తీసింది | Son love killed a father

Son love killed a father

Son love, Suicide, Mahabubnagar, Son love Story, లవ్, ప్రేమ, కొడుకు లవ్ స్టోరీ

Mahabubnagar dist Manavpad mandal Maddur village resident monappa suicide for harrasing about his sons love marriage. Hayathnagar police harrased him to tell details about his son.

కొడుకు లవ్ తండ్రి ప్రాణం తీసింది

Posted: 04/25/2016 10:46 AM IST
Son love killed a father

వయస్సులో ఉన్న వాళ్లు ప్రేమించుకోవడం.. అందులో చాలా మంది పెళ్లిళ్లు చేసుకోవడం కామన్. అలాగే ఓ యువకుడి లవ్ చేస్తే అది తీరా తండ్రి ప్రాణం తీసింది. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. కొడుకు లవ్ వల్ల కన్నతండ్రి ఉరిపోసుకొని చనిపోయాడు. మహబూబ్ నగర్ మానవపాడ్ మండలం మద్దూర్ కు చెందిన మోనప్ప కొడుకు ప్రవీణ్ కరీంనగర్ లో బీటెక్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన అతడి స్నేహితుల కోసం అప్పుడప్పుడు వస్తుండేవాడు. అలా వచ్చిపోయే టైంలోనే ఓ అమ్మాయితో లవ్ లో పడ్డాడు. గాఢంగా ప్రేమించుకన్న ఆ ప్రేమ జంట చివరకు పెళ్లి కూడా చేసుకున్నారు.

ఈ నెల 20న పెళ్లి చేసుకున్న ఈ జంట ఎక్కడికో వెళ్లిపోయారు. కాగా అమ్మాయి బంధువులు అబ్బాయి మీద కేసులు పెట్టారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్లి మోనప్పను విచారించారు. విచారణలో భాగంగా ఆయన వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. తన కొడుకు ఎక్కడికి వెళ్లాడో చెప్పాలని పోలీసులు వత్తిడి చెయ్యడం.. అమ్మాయి తరఫు బంధువులు బెదిరింపులకు పాల్పడటంతో ఆ తండ్రి ఉరి వేసుకొని చనిపోయాడు. తన తండ్రి చావుకు హయత్ నగర్ పోలీసులే కారణమని పెద్ద కొడుకు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాపం.. పిల్లలు చేసిన తప్పుకు ఓ తండ్రి నిండు ప్రాణం పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles