పాలేరులో తుమ్మల పోటీ | Tummala Nageshwar Rao contesting from Paaleru

Tummala nageshwar rao contesting from paaleru

Tummala Nageshwar Rao, Telangana, Khammam, Paaleru

Telangana minister Tummala Nageshwar Rao contesting in Paleru by polls. Telangana CM KCR decided to contest in Paaleru with Tummala Nageshwar Rao.

పాలేరులో తుమ్మల పోటీ

Posted: 04/21/2016 08:42 AM IST
Tummala nageshwar rao contesting from paaleru

ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరు శాసనసభా స్థానానికి నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీల్లో హడావిడి మొదలైంది. తమ పార్టీ అభ్యర్థులు సింగిల్ హ్యాండ్ తో గెలిచేలా ప్లాన్ వేస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ మంత్రి తుమ్మలను రంగంలోకి దించేందుకు నిర్ణయం తీసుకుంది టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ అధినేత చాలా ఆలోచించి తుమ్మల పేరును ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. అక్కడి పరిస్థితులు, తుమ్మల నాగేశ్వర్ రావు పనీ తీరుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అంతగా పట్టు లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్-లో భాగంగా టీడీపీని వీడి టీఆర్ఎస్-లో చేరారు తుమ్మల నాగేశ్వరరావు. అనంతరం మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా పాలేరు ఉప ఎన్నిక రావడంతో అక్కడ తమ అభ్యర్థిని బరిలో దింపి గెలిపించుకోవడం ద్వారా జిల్లాలో పట్టు సాధించేందుకు కారు పార్టీ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసిందన్న వాదన వినిపిస్తోంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ గట్టి అభ్యర్థి అయిన తుమ్మలను బరిలో దించాలని నిర్ణయించడం, అందుకు ఆయన కూడా ఒప్పుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tummala Nageshwar Rao  Telangana  Khammam  Paaleru  

Other Articles