Centre inducting chaos, taking away power of elected governments: Uttarakhand Court

Central government took away power of elected govt says highcourt

Uttarakhand High Court, Uttarakhand, Harish Rawat, Uttarakhand political crisis, pm modi, union government,

The Centre got a rap on its knuckles yet again in the Uttarakhand High Court which said by imposing President's rule it was taking away the powers of an elected government and introducing "chaos" and that floor test "cannot be deprived of its sanctity".

కేంద్రానికి మొట్టికాయలు.. ప్రజాస్వామ్యాన్ని పెకిలిస్తున్నారని హైకోర్టు అక్షింతలు..

Posted: 04/20/2016 06:45 AM IST
Central government took away power of elected govt says highcourt

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు కేంద్రానికి మెట్టికాయలు వేస్తూ.. కఠిన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కల్లోలం సృష్టిస్తున్నారంటూ కేంద్రంపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం అధికారాలను కేంద్రం అపహరించాలని చూస్తుందని దుయ్యబట్టింది. శాసనసభావేదికపై బలపరీక్ష పవిత్రతను ఎవరూ కాదనలేరని, అంతిమంగా లెక్క తేలాల్సింది అసెంబ్లీ వేదికపైనేనని స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం హరీశ్‌రావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ కేఎం జోసెఫ్, న్యాయమూర్తి వీకే బిష్ట్‌తో కూడిన ధర్మాసనం కేంద్రానికి మొట్టికాయలు వేసింది.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడం నిబంధనలకు అనుగుణంగా సాగలేదని, కేంద్ర ప్రభుత్వం చర్య ప్రజాస్వామ్యాన్ని పెకిలించేలా సాగుతోందని ధర్మాసనం కఠిన వ్యాఖ్యలు చేసింది. "ఈ తరహా వివాదాలు వచ్చిన వేళ, మధ్యస్తంగా ఉండాల్సిన కేంద్రం ఇలా రాష్ట్రపతి పాలన దిశగా సాగివుండాల్సింది కాదని పేర్కొంది. అంత హడావుడిగా ప్రభుత్వాన్ని సస్పెన్షన్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని అభివృద్ధి పనులూ ఆగిపోయాయని, ఇందుకు ఎవరిని నిందించాలని కేంద్రాన్ని నిలదీసింది. ఓట్ల డివిజన్ పై స్పీకర్ వైఖరిని సైతం ప్రశ్నించింది. మార్చి 28న రావత్ కు బలనిరూపణకు అవకాశం ఇచ్చి వుండాల్సిందని అభిప్రాయపడింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles