Mudragada serious on Andhra Pradesh Government

Mudragada padmanabham takes on chandrababu on kapu s issue

mudragada padmanabham, pawan kalyan, ys jagan, anantapur, andhra pradesh, kapu leader, ys jagan mohan reddy, chandrababu naidu, tdp election promise, ap government,

Kapu agitation leader Mudragada Padmanabham has visited Anantapur and says there is either pawan nor no jagan behind his agitation.

ITEMVIDEOS: నా వెనుక పవన్ కల్యాన్.. వైఎస్ జగన్ ఇద్దరూ లేరు.. బాబుపై విమర్శలు

Posted: 04/17/2016 09:59 AM IST
Mudragada padmanabham takes on chandrababu on kapu s issue

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు నిప్పులు చెరిగారు. అనంతపురంలో టీడీపీ నేతలు దిగజారి మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాపులకు న్యాయం చేసేవారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. కాపులకు ఏటా రూ. 1000 కోట్లు ఇస్తామన్నారు... ఆ హామీలు నెరవేర్చనందునే తాము ఉద్యమబాట పట్టినట్లు ఆయన వివరించారు.

అయితే కాపు ఉద్యమానికి సహకరించమని తాను జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ని కోరలేదని చెప్పారు. కాపుల కోసం ఉద్యమబాట పట్టిన తనను టీడీపీ నేతలు తనపై దారుణ విమర్శలు చేశారని, ఎవరెన్ని విమర్శలు చేసినా కాపుల ఉన్నతికి తాను సాగించే పోరుబాట అగదని చెప్పారు. కాగా, వ్యక్తిగత ఎజెండా లేదని... రాజకీయాలకు దూరం అని ఆయన వెల్లడించారు. తన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్నది అవాస్తవమన్నారు.

జూన్లో ఉద్యమ కార్యాచారణ ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యమం చేసినప్పుడు... తన వెనుక చంద్రబాబు ఉన్నారనుకోవాలా అని తనపై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు. కాపు ఉద్యమం అణచి వేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ముద్రగడ ఆరోపించారు. కాపులు బానిసలు, సంఘ విద్రోహ శక్తులు కాదని ఆయన స్పష్టం చేశారు. తుని కేసులో కాపులను పోలీసులు వేధిస్తున్నారంటూ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada padmanabham  kapu leader  chandrababu  ys jagan mohan reddy  pawan kalyan  

Other Articles