Foreign Ministry suspends Mallya’s diplomatic passport

Foreign ministry suspends mallya s diplomatic passport

Vijay Mallya, Passport, Banks, ED, IDBI

Within days of a request from the Enforcement Directorate, in connection with a money laundering probe in the over Rs. 900 crore IDBI Bank loan fraud case, the Ministry of External Affairs suspended liquor baron Vijay Mallya’s diplomatic passport. It has also threatened to revoke it if he doesn’t appear before the Indian High Commission in London within a week.

మాల్యాకు మరో ఎదురుదెబ్బ

Posted: 04/16/2016 07:09 AM IST
Foreign ministry suspends mallya s diplomatic passport

అప్పులు ఎగ్గొట్టి దేశం వదిలివెళ్లిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు విజయ్‌మాల్యాకు మరో గట్టి షాక్ తగిలింది. ఆయన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పాస్‌పోర్ట్‌ను రద్దుచేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టును ఆశ్రయించింది.

ఐడీబీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.900 కోట్ల రుణానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసు విచారణకు సంబంధించి ముంబైలోని ఏజెన్సీ కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ మాల్యాకు మార్చి 10 నుంచి ఈనెల 2 మధ్య ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ మూడుసార్లూ గడువు తేదీనాడు ఏజెన్సీ ముందు హాజరయ్యేందుకు నిరాకరించిన మాల్యా.. మే వరకు గడువు కావాలని కోరారు. ఇక ఏమాత్రం అవకాశం ఇచ్చే ఆలోచనలో లేని ఈడీ ఆయనపై చర్యలకు దిగింది. ఈడీ సలహా మేరకు మంత్రిత్వ శాఖలోని పాస్‌పోర్టు జారీ విభాగం మాల్యా పాస్‌పోర్ట్‌ను తక్షణమే అమలులోకి వచ్చేలా నాలుగువారాల పాటు సస్పెండ్ చేసిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. పాస్‌పోర్టుల చట్టం, 1967లో సెక్షన్ 10ఏ ప్రకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే సెక్షన్ 10(3)(సీ) ప్రకారంగా పాస్‌పోర్ట్‌ను ఎందుకు ఉపసంహరించుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని మాల్యాను విదేశాంగ శాఖ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  Passport  Banks  ED  IDBI  

Other Articles