Senior SP had 152 crores

Senior sp had 152 crores

Police, Chandigarh,Gurpreet Singh Bhullar

The two richest legislators in Punjab according to affidavits filed in 2012 are two Congress MLAs - Kewal Dhillon with Rs 137 crore (including his son's assets) and Karan Kaur Brar with Rs 128 crore. But guess who can trump them both - senior superintendent of police (SSP) Gurpreet Singh Bhullar. The top cop has properties worth Rs 152 crore, according to the latest property returns of IPS officers uploaded on the Union home ministry website.

ఆ పోలీసోడి ఆస్తి విలువ 152 కోట్లు

Posted: 04/15/2016 12:52 PM IST
Senior sp had 152 crores

అతడు పేరుకే పోలీస్ కానీ అతడి ఆస్తుల గురించి తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. నెలకు జీతం తీసుకునే ఓ వ్యక్తి ఏకంగా కోట్లకు కోట్ల రూపాయలు ఎలా పోగేశాడు అన్నది తేలాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 152 కోట్ల రూపాయలు పోగేసిన ఓ ఎస్పీ అంశం వార్తల్లో నిలిచింది. మొహాలీలో సీనియర్ ఎస్పీగా పని చేస్తున్న గుర్ ప్రీత్ సింగ్ భుల్లర్ అనే వ్యక్తి ఆస్తుల విలువ అక్షరాల 152 కోట్ల రూపాయలు.తన ఆస్తి విలువ 152 కోట్లన్న విషయాన్ని ఏకంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే ఐపీఎస్ అధికారుల ఆదాయ రిటర్నులలో పేర్కొన్నారు.

గురు ప్రీత్ సింగ్ భుల్లర్ అనే ఈ సీనియర్ ఎస్పీకి ఎనిమిది నివాస భవనాలు, నాలుగు వ్యవసాయ క్షేత్రాలు, మూడు కమర్షియల్ ప్లాట్లు ఉన్నట్లు భుల్లర్ తెలిపారు. వాటిలో ఢిల్లీలోని బారాఖంబా రోడ్డులో గల కమర్షియల్ ప్లాటు విలువ రూ. 85 లక్షలు. అలాగే ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్ అనే ఖరీదైన ప్రాంతంలో 1500 చదరపు గజాల ఖాళీ స్థలం కూడా ఉంది. మొహాలీలోని బరైలీ గ్రామంలో సాగుకు పనికిరాని మరో భూమి విలువ రూ. 45 కోట్లు. వీటిలో చాలావరకు తనకు తన తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులేనని భుల్లర్ చెప్పారు. 2009 నుంచి 2013 వరకు ఒకసారి, 2015 నుంచి ఇప్పటివరకు ఈయన మొహాలీ సీనియర్ ఎస్పీగా ఉన్నారు. మొత్తానికి ఆ ఫోలీస్ ఆయన సంపాదన ఎలా వచ్చింది అనే దాని మీద అందరూ చర్చించుకుంటున్నారు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Police  Chandigarh  Gurpreet Singh Bhullar  

Other Articles