why did sakshi refused to interview pawan kalyan.?

News channel refused to do pawan interview

Pawan Kalyan Interview, Pawan Kalyan Interviews for TV CHannels on Sardaar Gabbar Singh, Pawan Kalyan Interview, pawan kalyan, interview, ysrcp, sakshi. TV channel, YS Jagan

one media house allegedly 'refused' to do Pawan's interview. This has definitely come as a huge shock. And the channel is owned by none other than YS Jagan.

పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూకు మన‘సాక్షి’ నిరాకరించిందా..? పరాజయమే కారణమా..?

Posted: 04/13/2016 06:04 PM IST
News channel refused to do pawan interview

పవర్ స్టార్, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక సినిమాలకు దూరంగా, కీలక, ప్రత్యక్ష రాజకీయాలకు దగ్గరగా వుంటానని, 2019 నాటి ఎన్నికలలో తమ పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలుస్తుందని ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ నలుగురు మిత్రులు కలసినా, గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ఇదే అంశం చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ తర్వాత పవన్ ఇంటర్వ్యూల కోసం లీడింగ్ తెలుగు ఛానళ్లన్ని ఆయన కోసం క్యూ కట్టాయి. ఆయన మాట్లాడిన నాలుగు మాటలను పదే పదే ప్రసారం చేస్తూ తమ రేటింగ్ పెంచుకునేందుకు పోటీ పడ్డాయి,

ఈ ఇంటర్వ్యూల్లో తన భవిష్యత్‌  రాజకీయ జీవితం గురించి.. వర్థమాన రాజకీయాల గురించి అడిగిన వివిధ ప్రశ్నలకు జనసేనాని సవివిరమైన సమధానం ఇచ్చారు. తెలుగు చానల్స్ అన్నింటికీ ప్రముఖ ఛానెల్స్ నుంచి అంతమాత్రంగా రేటింగ్ వున్న అన్ని ఛానెల్స్ కు  పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏ ఛానెల్ వారు వచ్చి సంప్రదించినా కాదనకుండా, లేదనకుండా ఆయన తన సమయాన్ని కేటాయించి ఆయా ఛానెళ్ల ద్వారా తన మనస్సులోని మాటలను తన అభిమానులతో, జనసేన కార్యకర్తలతో పంచుకున్నారు,

అయితే పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ మాత్రం నిరాకరించింది. గెలుపు అంచుల నుంచి తమను పరాజయంలోకి నెట్టివేయడానికి కారణమైన జనసేనాధిపతి ఇంటర్వ్యూను మాత్రం ‘సాక్షి’ ఛానల్  వద్దనుకుందట. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఎన్నికలకు వెళ్లిన తరుణంలో తమ అంచనాలను, తమ పార్టీకి పడే ఓట్లను తన అభిమానుల ద్వారా చీల్చీ, ప్రత్యర్థి పార్టీ తెలుగు దేశం పార్టీకి విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించి, ప్రత్యక్ష కారణమైన పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ మాత్రం సాక్షి వద్దనుకుందట.

తొలుత అందరి మాదరిగానే పవన్ ఇంటర్వ్యూ చేద్దామని నిర్ణయించుకుని ఆఖరి నిమిషంలో తమ ‘పెద్ద’ నుంచి వచ్చిన ఆదేశాలతో ఆగిపోయిందట. అదెలా అంటే.. పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ కోసం ‘సాక్షి’ ఆయన పీఆర్‌ఓ ను సంప్రదించింది. పవన్ సుముఖంగానే వున్నారు.. మీరు ఫలానా సమయంలో రండీ అంటూ అపాయింట్ మెంట్ కూడా ఇచ్చేశారట. ఇక ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతున్న సాక్షి టీమ్ ఆఖరి నిమిషంలో రాలేమని చెప్పేసిందట. అయితే పవన్ ఇంటర్వ్యూ గురించి ఆ ఛానల్ ‘పెద్ద’ కు సమాచారం వెళ్లడం..  ఆయన ఎట్టి పరిస్థితుల్లోను పవన్ కల్యాణ్ ను ఇంటర్వ్యూ చేయవద్దని ఆదేశించడంతో.. ‘సాక్షి’ ఛానల్ పవన్ ఇంటర్వ్యూ తీసుకోలేదని సమాచారం.

పవన్ కల్యాణ్ కు రాజకీయంగా వైసీపీ తో ఉన్న శతృత్వంతో పాటు.. తమ పార్టీకి కేవలం ఆరు లక్షల ఓట్లను అడ్డుకుని అధికారాన్ని అందుకోనీయకుండా చేసింది పవన్ కల్యాన్ అని భావించిన ఛానల్ పెద్ద ఇంటర్వ్యూ ను తమ ఛానల్‌ లో ప్రసారం చేయడం అనవసరమని భావించినట్లు, అందుకనే ఆ ఛానల్ పెద్ద ఈ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది. అయితే గత కొంత కాలం క్రితం పవన్ కల్యాన్ గురించి పాజిటివ్ గా వచ్చిన కథనాలు కాస్తా.. ఇప్పుడు నెటిగివ్ గా మారిపోయాట. ఇందుకు భూమానాగిరెడ్డి కూడా మరో కారణమని తెలుస్తుంది.

భూమానాగిరెడ్డి సతీమణి శోభానాగిరెడ్డి నియోజకవర్గంలో అమె కూతురు అఖిలప్రియ పోటీ చేసిన సందర్భంగా అక్కడ టీడీపీ అభ్యర్థిని పోటీ లేకుండా చేయడంలో పవన్ కల్యాణ్ ఏకంగా చంద్రబాబుతో సంప్రదించి చర్యలు తీసుకున్నారట, అయితే అక్కడ గెలుపోందిన అఖిలప్రియ, భూమానాగిరెడ్డిలు ఇటీవల టీడీపీలో చేరిపోవడం, దీని వెనుక కూడా పవన్ కల్యాన్ ప్రమేయముందని భావిచిన వైసీపీ పెద్ద ఇక పవన్ కల్యాన్ గురించి కరెంట్ హ్యాపెనింగ్స్ మాత్రమే రాయాలని, అంతేకాని విశ్లేషణలు వద్దని కూడా నిర్ణయం తీసుకున్నారట.

అంతకుముందు సాక్షి పేపర్ లో కూడా  పవన్ కల్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్‌’ సినిమా ఇంటర్వ్యూను చేశారు తప్ప.. రాజకీయ అంశాల జోలికి  వారు కూడా పోలేదు! చిన్నా, పెద్దా తేడాలేకుండా అన్ని ఛానెళ్ల ద్వారా ప్రసారమవుతున్న పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను తమ ఒక్క ఛానల్ ప్రసారం చేయనంత మాత్రన పవన్ కు వచ్చే నష్టమేమి లేదని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ ఇంటర్వ్యూలతో సాక్షి రేటింగ్ పెంచుకునే అంశంలో సాక్షి వెనకబడిందని అంటున్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరన్న విషయాన్ని మన‘సాక్షి’ అంగీకరిస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  interview  ysrcp  sakshi. TV channel  YS Jagan  

Other Articles