agrigold investors attack accused in high court premises

Agri gold directors attacked by victims in karnataka high court premises

agri gold company, chairman, venkata ramarao, sheshunarayana, three directors, karnataka high court, Benhuluru, Agrigold victims

agri gold chaiman venkatesh narayanan and directors attacked by investors in the premises of karnataka high court

అగ్రిగోల్డ్ నిందితులపై మూకుమ్మడి దాడి.. కర్ణాటక హైకోర్టులో ఉద్రిక్తత

Posted: 04/12/2016 07:27 AM IST
Agri gold directors attacked by victims in karnataka high court premises

ముదుపు పేరుతో లక్షల మందికి టోకారా ఇచ్చి, వేల కోట్లు ఎగవేసిన అగ్రిగోల్డ్ సంస్థ యజమానులపై బాధితులు కసి తీర్చుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు దక్షిణాది రాష్ట్రాలలో డబ్బులు సేకరించిన అగ్రీ గోల్డ్ సంస్థ యాజమాన్యానికి కర్ణాటకలో బాధితులు బుద్ది చెప్పారు, కేసు విచారణ నిమిత్తం నిందితులను బెంగళూరులోని కర్ణాటక హైకోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. తమ రెక్కల కష్టాన్ని దోచుకున్నారంటూ కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగిన బాధితులు.. ఒక్కసారిగా  అగ్రిగోల్డ్ యజమానులపై విరుచుకుపడ్డారు.

సంస్థ చైర్మన్ అవ్వాసు వెంకటరామారావు, ఆయన సోదరుడు శేషునారాయణతోపాటు మరో ముగ్గురు డైరెక్టర్లపై బాధితులు దాడి చేశారు. పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో, కోర్టు అవరణలోనే బాధితులు వారిపై చెప్పులు, రాళ్లతో దాడి చేశారు, బాధితులు మూకుమ్మడిగా దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా హైకోర్టు ఆవరణ రణరంగాన్ని తలపించింది. బాధితులు వందల సంఖ్యలో గుమ్మికూడటంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపుచేయలేకపోయారు. అతికష్టం మీద నిదితులను సరక్షిత ప్రాంతానికి తరలించగలిగారు.

అగ్రిగోల్డ్ నిందితులను కర్ణాటక సీఐడీ పోలీసులు పది రోజుల కిందటే నెల్లూరు  జిల్లా నుంచి కర్ణాటకకు తరలించి అక్కడ విచార్తిస్తున్నారు. అయితే ఇదే కేసుపై హైదరాబాద్ హైకోర్టులో సమగ్ర విచారణ జరుతున్న నేపథ్యంలో  కర్ణాటక సీఐడీ విచారణను నిలిపివేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. నిందితులైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జడ్జి ఆదేశానుసారం వారిని హైదరాబాద్ కోర్టుకు తరలించేందుకు వాహన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. బాధితుల దాడిలో పలువురు లాయర్లకు కూడా గాయాలయ్యాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agri gold company  chairman  directors  karnataka high court  Benhuluru  Agrigold victims  

Other Articles