Model escapes abduction bid in Bhopal by jumping out of moving car

Model jumps out of moving car to escape abduction bid

bhopal model, kidnap bid, moving car, ex boy friend, Ameer, crime against women, crime against women in Bhopal, Aspiring model jumps out of moving car, aspiring model escapes abduction

An aspiring model reportedly escaped an abduction bid by four men in Bhopal - by jumping out of a moving car.

కారులోంచి దూకి కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మోడల్

Posted: 04/05/2016 08:52 PM IST
Model jumps out of moving car to escape abduction bid

తనను ప్రేమించడం లేదనే కారణంతో ఓ మోడల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమెపై అత్యాచారానికి ఓడిగట్టాడు ఆమె మాజీ బాయ్‌ప్రెండ్. అయితే ఈ మధ్యకాలంలో యువతులపై యధేశ్ఛగా జరుగుతున్న తరహాలోనే గ్యాంగ్ రేప్ కూడా యత్నించాడు ఆ బాయ్ ప్రెండ్. ఇందుకోసం తన స్నేహితులను పురమాయించి.. అమెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు, అయితే అదృష్టం బాగుంది కాబట్టి ఆ మోడల్ తన బాయ్ ఫ్రెండ్ వ్యూహాన్ని పనిగట్టి కదులుతున్న కారులోంచి దూకి తనను తాను రక్షించుకోగలిగింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.... తన స్నేహితుడితో కలిసి కారులో పనిమీద బయటకు వెళ్తున్న సమయంలో హఠాత్తుగా ముగ్గురు యవకులు వచ్చి ఆమెతో గొడపడ్డారు. ఆ తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి వేరే కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కిడ్నార్లకు తనకు పెనులాగ జరిగిందని బాధితురాలు పేర్కొంది. కారులోకి ఎక్కకపోతే మొహంపై యాసిడ్ పోస్తామంటూ బెదిరించారని కూడా తెలిపింది. అలా ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కొంత దూరం వెళ్లే సరికే ఆమె కారులో నుంచి దూకేసింది.

తనతో పెనుగులాడిన నిందితులను కూడా బాధితురాలు గుర్తించింది. ఈ కిడ్నాప్ ఉదంతానికి తన మాజీ ప్రియుడు అమీర్ కారణమని బాధితురాలు పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తన మాజీ ప్రియుడికి ఏనాడు కూడా తాను హాని చేయలేదని, తనపై ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారో తెలియడం లేదని బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. భోపాల్‌లో ఈ ఘటన కలకలం రేపుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhopal model  kidnap bid  moving car  ex boy friend  Ameer  

Other Articles