NIA officer Mohammed Tanzil Ahmed shot dead

Nia officer mohammed tanzil ahmed shot dead

NIA, Mohammed Tanzi Ahmed, Pattankot, Uttarpradesh

A National Investigation Agency (NIA) officer, who had handled several cases related to the Indian Mujahideen (IM) including the arrest and probe against its India chief Yasin Bhatkal, was shot dead past midnight Saturday by unidentified men at Sahaspur in Bijnor district of western UP. Police said his body bore 22 bullet injuries.

ఎన్‌ఐఏ అధికారి తాంజిల్ అహ్మద్‌ హత్య

Posted: 04/04/2016 01:46 PM IST
Nia officer mohammed tanzil ahmed shot dead

ఎన్‌ఐఏ అధికారి తాంజిల్ అహ్మద్‌ హత్య కేసులో దర్యాప్తు బృందాలు విచారణ వేగవంతం చేశాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందాలు.. పక్కా ప్లాన్‌తోనే ఆయనను అంతమొందించినట్లు నిర్ధారణకు వచ్చాయి. పఠాన్‌కోట్‌ దాడి విచారణలో తాంజిల్ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో.. ఆ కేసుకు, ఈ హత్యకు సంబంధం ఉందా అన్న కోణం నుంచి విచారణ జరుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నోర్‌ సమీపంలో హత్యకు గురైన ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ కేసులో విచారణ వేగవంతమైంది. ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీస్‌ స్పెషల్ సెల్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్ బృందాలు.. దాడి జరిగిన తీరును పరిశీలించాయి. ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి... ఇది దొంగతనం కోసం జరిగిన దాడి కాదని.. చాలా పకడ్బందీగా మాటు వేసి ఆయనను అంతమొందించారని నిర్ధారణకు వచ్చాయి.

తాంజిల్‌ కారుపై దాడి చేసిన దుండగులు..ఎలాంటి ఛాన్సూ తీసుకోదల్చుకోలేదు. ఆయన శరీరంలో డాక్టర్లు మొత్తం 26 బులెట్లు గుర్తించారు. కాల్పుల్లో గాయపడిన ఆయన భార్య ఫర్జానా ప్రస్తుతం నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. తాంజిల్‌ అప్రమత్తం చేయడంతో దాడి జరిగినప్పుడు కారులోనే ఉన్న ఇద్దరు పిల్లలూ సీట్ల కింద దాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. గతంలో బీఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్ పని చేసిన తాంజిల్‌ అహ్మద్‌.. 2009 నుంచి ఎన్‌ఐఏలో డిప్యూటేషన్‌ మీద పని చేస్తున్నారు.

బంధువుల పెళ్లి నుంచి బిజ్‌నోర్‌ జిల్లాలోని సహస్‌పూర్‌లోని తన ఇంటికి వస్తుండగా దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి ఆయనను పొట్టనబెట్టుకున్నారు. ఆయన మృతికి సంతాపంగా ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ప్రకటించింది. తాంజిల్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోమ్‌ మంత్రి రాజ్‌నాథ్‌.. దోషులెవరో తేల్చి కఠిన శిక్ష విధిస్తామని లక్నోలో తెలిపారు. డేరింగ్ ఆఫీసర్ గా పేరున్న తాంజిమ్‌కు వ్యక్తిగతంగా శత్రువులు లేరని బంధువులు చెప్తున్నారు. పఠాన్ కోట్ దాడి, ఇతర కేసుల దర్యాప్తు బృందాల్లో ఆయన సభ్యుడు. అందుకే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి అధికారిక లాంఛనాల మధ్య తాంజిల్‌కు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, పోలీసులు పెద్ద ఎత్తున హాజరై... ఆయనకు నివాళులు అర్పించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIA  Mohammed Tanzi Ahmed  Pattankot  Uttarpradesh  

Other Articles