Beggar hits jackpot, wins Rs 65 lakh lottery

Beggar from andhra wins kerala jackpot

Kerala, Beggar, lottery, Andhra Pradesh, Vellarada, Ponnaiyya, akshaya lottery, Kerala lottery results, Akshaya lottery, Kerala lottery,India, Kerala

In a rags to riches story, Ponnaiyya, a migrant alm-seeker who was living in suburb Vellarada, won the jackpot of Rs 65 lakh in the state-run Akshaya lottery

పోగొట్టుకున్న చోటే వేతకాలన్నది తూచ్.. అదృష్టముంటే ఎక్కడున్న నో ప్రాబ్లమ్

Posted: 04/01/2016 07:02 PM IST
Beggar from andhra wins kerala jackpot

పోగోట్టుకున్న చోటే వెతికితేనే పోగుట్టకున్నది దోరుకుతుంది అన్నది పాత నానుడి.. ఇలా ఆంధ్రప్రదేశ్ లో తన కాలు పోగొట్టుకుని, బతుకుదెరువును పోగోట్టుకుని పరాయి రాష్ట్రానికి వెళ్లి పోట్టకూటి కోసం యాచకవృత్తిని చేపట్టిన ఆ దురదృష్టవంతుడికి అక్కడ అదృష్ట లక్ష్మీ వరించింది. అనంతపురం జిల్లాకు చెందిన పొన్నయ్యది అలాంటి అదృష్టమే. బతకడం కోసం బెగ్గర్(యాచకుడి)గా మారిన అతనికి భారీ మొత్తం లాటరీలో బహుమతిగా దక్కింది. అది కూడా కేరళలో!

పొన్నయ్య ప్రస్తుత నివాసం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని మార్తండం(కేరళ) బస్ స్టాండ్. ఒక కాలు లేని అతను బిచ్చమెత్తుకుని బతుకీడుస్తున్నాడు. కూడబెట్టిన సొమ్ములో కొంత అనంతపురంలో ఉంటోన్న భార్యకు పంపుతాడు. మిగిలిన దానితో లాటరీ టికెట్లు కొంటాడు.  రెండు రోజుల కిందట పోలీసులు వచ్చి పొన్నయ్యను స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులతోపాటే వచ్చిన ఓ వ్యక్తి స్టేషన్ కు వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పాడు. 'పొన్నయ్య.. నీకు లాటరీలో రూ.65 లక్షల బహుమతి వచ్చింది' అని. ఆ వ్యక్తి.. పొన్నయ్యకు లాటరీ టికెట్ అమ్మినాయన!

కేరళలో ప్రభుత్వ అనుమతితో లాటరీలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలో పోలీసుల ప్రమేయం ఉంటుంది కాబట్టి బహుమతి వచ్చినవాళ్లను బురిడీ కొట్టించడం అంత తేలికకాదు. అమౌంట్ కాస్త ఎక్కువ కాబట్టి పొన్నయ్య వాళ్లింటికి కబురు పెట్టారు పోలీసులు. పొన్నయ్య వాళ్ల నాన్న, అన్నయ్యలు నిన్నే అనంతపురం నుంచి కేరళకు వెళ్లారు. పొన్నయ్య అంగీకారంతో సదరు డబ్బును వాళ్లకు ఇచ్చేశారు పోలీసలు. ఈ డబ్బులతో తన పిల్లల చదువులు, ఇల్లాలి కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నాడు పొన్నయ్య.

మొదట్లో భవన నిర్మాణ కూలీ అయిన పొన్నయ్య పని ప్రదేశంలో కిందపడి కాలు పోగొట్టుకున్నాడు. అప్పట్నుంచి పనికి వెళ్లలేకి బిక్షగాడిగా మారి ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఏపీలో బతుకు మరీ భారంగా మారడంతో కేరళకు వలస వెళ్లి అక్కడా వృత్తిని కొనసాగించాడు. ఇంత డబ్బొచ్చింది కదా, ఇక హ్యాపీగా ఇంటికి వెళతాడేమో అనుకుంటే.. 'అలా కాదు, కేరళలోనే ఉండి అదే వృత్తిని కొనసాగిస్తా'అని చెబుతున్నాడు పొన్నయ్య!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beggar  jackpot  Rs 65 lack lottery  anantapuram  ponnaiyya  Kerala  

Other Articles