Won't Allow President's Rule In Delhi says Arvind Kejriwal

Won t allow presidents rule to be imposed in delhi says arvind kejriwal

Arunchal Pradesh, Uttarakhand, Delhi Chief Minister Arvind Kejriwal, ruling party lawmakers, mandate of the people, never let the incident repeat, Prime Minister Narendra Modi, destabilise, goondagardi,New Delhi, President Rule, Delhi CM Arvind Kejriwal, BJP, AAP

Delhi Chief Minister Arvind Kejriwal today said he will never let such an "incident" be repeated in the national capital.

మళ్లీనా.. ఇక చాలు.. రాజధానిలో మాత్రం ఆ పాలనను రానివ్వబోం..

Posted: 04/01/2016 06:40 PM IST
Won t allow presidents rule to be imposed in delhi says arvind kejriwal

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇవ్వబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన తలెత్తిన నేపథ్యంలో అలాంటిది ఢిల్లీలో aపునావృతం కానివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాతీర్పుకు రాజకీయ పార్టీలు గౌరవాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు, ప్రజలు తమ తీర్పుతో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయన్న విషయాన్ని మర్చిపోరాదని ఆయన గుర్తుచేశారు,

ప్రజాతీర్పును ధిక్కరించి కుట్రలు, కుతంత్రాలతో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారన్నారు, అధికారంలో ఉన్న శాసనసభ్యులు ఏం చెప్తున్నారు.. ఎలాంటి పనులు చేస్తున్నారిన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పనిసరిగా వినాలి, చూడాలని కోరారు, ప్రజల అవసరాల మేరకే ప్రతిపక్షాల డిమాండ్లు ఉండాలని హితవు పలికారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై స్పందన కోరగా 'ఢిల్లీలో మేం ఎప్పటికీ అలాంటి పరిస్థితికి అవకాశం రానివ్వబోమని చెప్పారు.

కాగా, రానున్న రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలుచుకోలేదని బీజేపీకి తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వమే గుంఢాగిరి మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు. దానిని హిమాచల్ ప్రదేశ్లో తర్వాత ఢిల్లీలో ప్రయోగించాలని అనుకుంటున్నారని అన్నారు, అయితే అరుణాచల్ ప్రదేశ్ తరహాలో తాము బిజేపికి ఎక్కడా అవకాశం ఇవ్వబోమని చెప్పారు. అయితే ఢిల్లీలో రాజకీయ అనిశ్చితి కోసం తొలుత 21మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి.. మరో 23మంది ఎమ్మెల్యేలను కొనేయాలని అనుకుంటున్నారు' అని కేజ్రీవాల్ ఆరోపించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Delhi  President Rule  Delhi CM Arvind Kejriwal  BJP  AAP  

Other Articles