Telangana cm KCR described 450 projects in Maharastra

Telangana cm kcr described 450 projects in maharastra

KCR, Krishna, Godavari, Projects, Irrigation, Telangana

He power point presentation desicribed Maharastra projects on Godavari and Krishna rivers.

మహారాష్ట్ర 450 ప్రాజెక్టులు: కేసీఆర్

Posted: 03/31/2016 02:54 PM IST
Telangana cm kcr described 450 projects in maharastra

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో జలవిధానం మీద అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రాజెక్ట్ అదిరిపోయింది. గత రెండు నెలలుగా కేసీఆర్ చేసిన హోంవర్క్ అందరిని ఆకర్షించింది. ఆయన స్పీచ్ లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రాజెక్టుల గురించి ఆధారలతో సహా చూపించారు.  కృష్ణా, గోదావరి నదులు, ఉపనదులపై 450 ప్రాజెక్టులు కట్టారని సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు రావాల్సిన నీళ్లు రావడం లేదన్నారు. ఎక్కడికక్కడే లిఫ్టులు పెట్టి నీళ్లు తరలించుకుపోతున్నారని తెలిపారు. మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితేనే మనకు నీళ్లు వదిలే పరిస్థితి ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతో తెలుగు రాష్ర్టాలకు ముప్పు ఉందన్నారు. పెన్ గంగాపై మహారాష్ట్ర 31 ప్రాజెక్టులు నిర్మించింది, 9 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ బ్యారేజీలతో 80 నుంచి 100 టీఎంసీల నీరు ఆగిపోతుందన్నారు.

ప్రతిసారి మహారాష్ట్ర రాష్ట్రం మీద ఎత్తిపొడుపులు చేయడం కన్నా మన దగ్గర ఉన్న రీసోర్స్ ను వాడాలని కేసీఆర్ అన్నారు. వర్షపు నీరే తప్ప, నది నీళ్లు వచ్చే ఆస్కారం లేకుండా ప్రాజెక్టులు కట్టారని గుర్తు చేశారు. ప్రాజెక్టులు రీడిజైన్ చేయకపోతే నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. 1960లో కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తయింది, కిన్నెరసాని ప్రాజెక్టు ఉన్న ప్రాంతాన్ని ఎకో జోన్‌గా గత ప్రభుత్వాలు ప్రకటించాయని తెలిపారు. 10 కిలోమీటర్లు మానవ సంచారం లేకుండా నోటిఫై చేశారని పేర్కొన్నారు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పైపుల కోసం రూ. 750 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పారు. మొత్తంగాఅన్ని ప్రాజెక్టుల గురించి గూగుల్ ఎర్త్ సహాయంతో పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Krishna  Godavari  Projects  Irrigation  Telangana  

Other Articles