navdeep tweets on rave party issue, says he never owns farm house

Rave party busted at actor navdeep s farm house

police busted rave party, actor Navdeep’s farm house, rave party at navdeep farm house in Mominpet, rave party busted at navdeddp farm house, hero navdeep farm house rave party, navdeep rave party, drugs at rave party, nude dances rave party, rave party nude dance, celebrities absconding, foreign liquor seized

Acting on a tip-off, police has busted a rave party on Friday night at actor Navdeep’s farm house in Mominpet mandal, Rangareddy district. but navdeep condems all the issue, questions how can house warming function turn into rave party.

హీరో నవదీప్ ట్విట్లు.. గృహ ప్రవేశం, రేవ్ పార్టీ ఏది నిజం..?

Posted: 03/26/2016 10:32 AM IST
Rave party busted at actor navdeep s farm house

టాలీవుడ్ యువ హీరో నవదీప్ చెందిన ఫాంహౌస్ పై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు శనివారం తెల్లవారుజామున ఉమ్మడిగా దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్ మండలం చక్రంపల్లిలో నవదీప్ కు  ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని అబిజ్ఞానవర్గాల నుంచి పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ రేవ్ పార్టీలోమరికొందరు సినీ ప్రముఖులు మద్యం తాగుతూ డ్యాన్సర్లతో హంగామా చేస్తున్నారని, అర్థనగ్నం నృత్యాలు, అసభ్యకర నృత్యాలు హోరెత్తిపోతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు చేపట్టారు.

వెంటనే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించిన పోలీసులు సంయుక్తంగా దాడులు జరిగిపారు. అయితే తాము వస్తున్నామన్న సమాచారం మందుగానే అందుకున్న హీరోతో పాటు అతని స్నేహితులు, పెలబ్రిటీలు పార్టీ నుంచి పరారైయ్యారని పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నవదీస్ మేనేజర్ అరుణ్ సాయిని పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

దీనిపై నవదీప్ ట్విట్టర్లో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రేవ్ పార్టీ ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన మీడియాను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి ఫామ్ హౌసే లేదంటున్నాడు. మీడియాను ఉద్దేశించి ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ ``మీరు నా పేరు వాడిన ప్రతిసారీ ఒక్కో రూపాయి ఇచ్చినా నేను ఫామ్ హౌస్ కొనగలిగేవాడినేమో. ఎలాగో వీడి మీద చాలా ఉన్నాయి కదా. మరొకటి వేసేద్దాం అనుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి డిన్నర్ కి వెళ్తే.. రేవ్ పార్టీలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరి ఆ రేవ్ పార్టీతో నాకేంటో సంబంధం?.. వాడు చెప్పాడని.. వీడు రాశాడని.. ఇంకొకడు రాశాడంట..దేశానికి నేను ఎలాగూ పనికిరానని మీ ఫీలింగ్ కదా.. పోనీలే.. మీరైనా పనికిరండి. నన్ను పక్కనపెట్టి పనికొచ్చే పనిచేయండంటూ ట్వీట్ చేశాడు.

పెద్దలు, కుటుంబంతో కలిసి చేసుకున్న ఓ శుభకార్యాన్ని రేవ్ పార్టీ గా మార్చిన మహానుభావులందరికీ పాదాభివందనాలు అంటూ ట్వీట్‌లను ముగించాడు. అయితే పోలీసుల కథనంతో నవదీప్ కథనం పూర్తి బిన్నంగా వుంది. పోలీసులు సీజ్ చేశామంటున్న ఫారిన్ లిక్కర్ ఎక్కడిదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అయితే గృహ ప్రవేశం అయిన తరువాత బంధువులతో సేవిద్దామనుకున్న మద్యాన్ని సీజ్ చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారా..? అదే నిజమైతే.. అరుణ్ సాయి అనే వ్యక్తి నవదీప్ కు మేనేజరేనా.. కాదా..? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rave party  Navdeep  Actor  Drugs  foreign liquor  nude dances  celebrities  abscond  

Other Articles