Congress charges Ramdev with a role in rebellion by party MLAs in Uttarakhand

Congress accuses ramdev of plotting uttarakhand crisis

uttarakhand crisis, uttarkhand government crisis, baba ramdev, ramdev uttarakhand. haryana brand ambassador ramdev, patanjali ayurveda, Kishore Upadhyay

Claiming that he had enough evidence to substantiate his charge, Upadhyay said "Ramdev was in touch with Congress rebels," said Kishore Upadhyay.

బీజేపి, బాబా రాందేవ్ ల వల్లే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి

Posted: 03/24/2016 06:52 PM IST
Congress accuses ramdev of plotting uttarakhand crisis

ఉత్తరాఖండ్ లో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం నుంచి తాయిలాలు పోందుతున్న యోగా గురువు రాందేవ్ కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించింది. రాష్ట్రంలో అనిశ్చితికి దారితీసే పరిణామాలకు బాబా రాందేవ్ కుట్రలు, కుయుక్తులు పన్నుతూ అటు పార్టీ కార్యకర్త కన్న దిగజారుడు స్తాయిలో వ్యవహరిస్తూన్నారిన కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపించింది, బాబా రాందేవ్ బీజేపీకి బ్రోకర్ లా పనిచేస్తూ.. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నిస్తున్నాడని దుయ్యబట్టింది.

పార్టీకిలో పదవులు రానీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి వారికి కాషాయ కండువా కప్పేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నాడని  కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ ఆరోపించారు. పార్టీ మీద అగ్రహంతో వున్న ఎమ్మెల్యేలకు, కాషాయ పార్టీకి మధ్య బ్రోకర్ గా మారిన బాబా రాందేవ్.. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు యత్నిస్తున్నారని ఆయన అరోపించారు. నిత్యం శుభవాక్కులు పలుకుతూ.. సన్మార్గంలోనే నడవాలని ప్రజలకు చెప్పే బాబాలు ఇలాంటి హేయకరమైన చర్యలకు ఎలా పాల్పడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో రాందేవ్ టచ్ లో ఉన్నారనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. అసంతృప్త ఎమ్మెల్యేలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని అన్నారు. ప్రజలు తీర్పును గౌరవిస్తామని చెప్పే బీజేపి అందుకు భిన్నంగా ఎలా వ్యవహరించగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాందేవ్ తీరుతో స్వాములకే కాదు ఉత్తరాఖండ్ కు చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఏజెంట్ మాదిరిగానే కాకుండా పార్టీ కార్యకర్తలా కూడా వ్యహరిస్తున్నారని కిశోర్ ఉపాధ్యాయ మండిపడ్డారు. బీజేపికి అంతగా అధికార దాహం వుంటే అసెంబ్లీ ఎన్నికల వరకు అగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవానలి ఆయన సూచించారు.

కాగా, ఉత్తరాఖండ్ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోలేదని యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తతో తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. అమిత్ షా, నరేంద్ర మోదీని స్వతంత్రంగా పనిచేసుకోవాలని సూచించారు. గురువారం హరిద్వార్ లో పూలతో రాందేవ్ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పనిలేదని అన్నారు. అయతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థాయికి మించి తాయిలాలు అందుతున్న నేపథ్యంలో యోగా గురు ఈ చర్యలకు పాల్పడి వుండవచ్చన విమర్శలు కూడా వినబడుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarakhand Politcs  Ramdev  Kishore Upadhyay  bjp  amit shah  congress  

Other Articles