catch mallya before making me pay rs 260 fine says lady traveller

Ticket less lady traveller says won t pay fine catch vijay mallya first

PM Modi, Arun jaitley, mumbai lady, ticket less travel, rs 260 fine, Ms Bhansali, Railway Police, Vijay Mallya case,Mahalaxmi station,Mumbai trains, Shiv Sena targets Centre over Vijay Mallya, shiv sena samna targets vijay mallya, shiv sena critisizes vijay mallya, vijay mallya economic terrorist, uddav thackarey, Shiv Sena , Samna, Vijay Mallya, Economic terrorist, Centre, PM Modi, Arun jaitley, Dawood Ibrahim

The woman, caught at railway station and asked to pay up the fine of Rs. 260, said the police should first arrest Mr Mallya who owes the banks over Rs. 9,000 crore.

ఆర్థిక నేరగాళ్ల పట్ల సున్నితం.. మా పట్ల అంత కఠినం ఎందుకు..?

Posted: 03/23/2016 03:47 PM IST
Ticket less lady traveller says won t pay fine catch vijay mallya first

ఫిల్లి పాలు తాగుతూ.. తననెవరూ గమనించడం లేదని అనుకుంటుదట.. సరిగ్గా అలానే వుంది అర్ధిక నేరగాళ్ల పరిస్థితి. దేశ ప్రజలకు చెందిన వేలాది కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని.. రాజకీయ నేతల అండతో దేశం దాటిపోయి.. అక్కడి స్థిరపడుతున్నారు. బ్యాంకులకు మాత్రం రుణాలను ఎగవేస్తున్నారు. సామాన్యులకు లక్షల రూపాయలలో, రైతులకు వేల రూపాయలలో ఇచ్చే రుణాలకు మాత్రం వంద కండీషన్లు పెట్టి వాటిని చెల్లించని పక్షంలో గుండాలను బరిలోకి దింపి మరీ ముక్కు పిండి డబ్బు వసూటు చేసే బ్యాంకులు బాడాబాబులు, ఎగవేతదారుల విషయంలో మిన్నకుండిపోతున్నాయి.

కేంద్రంతోకి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం.. విదేశాలలో వున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చి దేశ ప్రజలందరి అకౌంట్లలోకి మూడు లక్షల రూపాయలు వేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయితే విదేశాలలోని నల్లధనాన్ని పక్కన బెడితే.. దేశంలో వున్న ప్రజాధనాన్ని దోచుకుంటున్న అర్థిక నేరగాళ్లను కట్టడి చేయాల్సిన అవసముందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. దేశంలోని ప్రజల డబ్బును దోచుకుపోతున్న వారికి వదిలేయడం ఎంతవరకు సమంజమని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇక సామాజిక మాద్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత, సాంకేతిక విప్లవంతో దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వ్యాపారం పెట్టినష్టాల పాలైన వారు రుణాల ఎగవేత విషయంలో కనీసం మాట కూడా మాట్లాడని ప్రజలు.. అదే విలాసాలకు కోట్లాది రూపాయలను తగలేసి.. వారిని నిలదీసిన మీడియాకు తాను ఎగవేత దారుడికి కానని, మీడియా ఎడిటర్లకు, సంస్థలు కూడా తాను చేసిన మంచిని మర్చిపోరాదని, తన వల్ల పోందిన లాభాన్నివిస్మరించరాదని కించిత్ పశ్చాతపం కూడా లేకుండా హెచ్చరికలు జారీ చేసిన లిక్కర్ బరాన్, అర్థిక నేరస్థుడు విజయ్ మాల్య విషయంలో మాత్రం ప్రజలకు పూర్తి అవగాహన వుంది.  

ముంబైలో మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న ఓ మహిళ.. కావాలనే టికెట్ తీసుకోకుండా రైలెక్కి, టికెట్ కలెక్టర్ ఫైన్ కట్టమని అడిగినప్పుడు.. ముందు విజయ్ మాల్యాను తీసుకొచ్చి అరెస్టు చేసి, అతడు బ్యాంకులకు అప్పున్న 9వేల కోట్లు కక్కించాలని, అప్పుడే తాను రూ. 260 ఫైన్ కడతానని పట్టుబట్టారు. చివరకు కావాలంటే తాను ఏడు రోజుల జైలు శిక్ష అయినా అనుభవిస్తాను గానీ, మాల్యాను అరెస్టు చేస్తే తప్ప ఫైన్ మాత్రం కట్టేది లేదని స్పష్టం చేశారు.

ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రేమలతా భన్సాలీ (44) దక్షిణ ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్థుల భవనంలో ఉంటారు. ఆమె ముంబై సబర్బన్ రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ మహాలక్ష్మి రైల్వేస్టేషన్ వద్ద టికెట్ చెకింగ్ అధికారికి పట్టుబడ్డారు. టికెట్ లేనందుకు రూ.260 జరిమానా కట్టాలని అడిగితే, బ్యాంకులకు రూ. 9వేల కోట్ల అప్పున్న విజయ్ మాల్యాను అరెస్టు చేసి, ఆయనతో ఆ సొమ్ము కట్టించాలని.. అప్పుడు తాను జరిమానా కడతానని చెప్పారు. అలా ఒకటి, రెండు కాదు.. దాదాపు 12 గంటల పాటు రైల్వే అధికారులతో వాదిస్తూనే ఉన్నారు.

విజయ్ మాల్యాను ఏమీ అనకుండా వదిలేసి, ఆయన వస్తానన్నప్పుడే రావాలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్న అధికారులు సామాన్యులను మాత్రం ఎందుకింత వేధిస్తున్నారని ప్రశ్నించారు. చివరకు ఆమె భర్త రమేష్‌ భన్సాలీని పిలిపించినా ఆయన కూడా ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని.. అంతా ప్రేమలత ఇష్టమేనని స్పష్టం చేశారు. దాంతో ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకున్న రైల్వే పోలీసులు.. ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఆమె జరిమానా మాత్రం కట్టనని, కావాలంటే జైలుకు వెళ్తానని చెప్పారు. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆనంద్ విజయ్ ఝా తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  PM Modi  Arun jaitley  mumbai lady  ticket less travel  rs 260 fine  

Other Articles