It's My Face But Your Mother's Body: Actress Jyothi Krishna To Makers Of Morphed Photo

Jyothi krishna calls for crackdown on fake actress porn

jyothi kirshna, jyothi kirshna news, jyothi kirshna pornographic images, jyothi kirshna morphed photographs, jyothi kirshna controversies, jyothi kirshna films, Fake images, doctored images, kerala Actress, Porn sites

Jyoti Krishna, one of the better known names in the Kerala film industry, has stood up to people who morph actors’ images for pornographic use.

ఫోర్న సైట్లలో నటి ఫోటోలు.. జ్యోతికృష్ణ వైల్డ్ రియాక్షన్

Posted: 03/22/2016 06:25 PM IST
Jyothi krishna calls for crackdown on fake actress porn

కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి జ్యోతికృష్ణ ఫొటోలు పోర్న్సైట్‌లో దర్శనమివ్వడంతో అమె అభిమానులు హైరనా పడ్డారు. సోషల్ మీడియాలో జ్యోతికృష్ణ న్యూడ్ ఫోటోలు హల్ చల్ చేస్తుండడంతో అమె అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తీవ్ర అవేదనకు గురయ్యారు. ఈ విషయం మొత్తం మలయాళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. అవి తన చిత్రాలు కాదని తేల్చిచెప్పిన అమె దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ఆమె సన్నద్ధమవుతుంది.

జ్యోతికృష్ణ ఫొటోలు పోర్న్ సైట్‌లో ప్రత్యక్షం కావడం,  వెంటనే ఇవి సోషల్ మీడియాలో భారీగా వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో వివాదం రేగింది. ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దలు, మరికొందరు స్నేహితులు, అభిమానులు జ్యోతికృష్ణ దృష్టికి తీసుకురావడంతో ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. తానంటే గిట్టనివారు ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ సైట్స్‌లో పెట్టారని మండిపడ్డారు. తనకు మానసిక వేదనను మిగిల్చినవారికి తగిన బుద్ధి చెప్పనునట్టు ఫేస్బుక్‌లో మలయాళంలో కామెంట్ పోస్ట్ చేశారు.

తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన వ్యక్తులను వదిలిపెట్టేది లేదన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తనలాంటి బాధితుల్లో మానసిక బలాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. బీబీసీ ఇంటర్వ్యూ లోమాట్లాడిన నటి జ్యోతి ప్రముఖ డైరెక్టర్, తన  స్నేహితుడి ద్వారా ఈ విషయం తన దృష్టికి  వచ్చిందని చెప్పారు. మార్పింగ్ చిత్రాలలో తన ముఖాన్ని పెట్టిన వారు.. తన శరీరాన్ని మార్పింగ్ చేసిన వాడి తల్లిది అమర్చాడని మండిపడ్డారు. కాగా నటిగా జ్యోతి కృష్ణ 2011లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. లైఫ్ ఆఫ్ జోసుట్టి (2015) ఆమె నటించిన చివరి చిత్రం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothi Krishna  Crackdown  Fake images  doctored images  kerala Actress  Porn sites  

Other Articles