Air India flight finally makes it to New Delhi after 12-hour delay

Air india flight to delhi lands in capital after 12 hour delay

air india, air india delay, air india kolkata delhi plane, air india ruckus, delhi, kolkata, air india plane, Pakistan High Commissioner Abdul Basit, air india technical snag, 14-hour delay, Kolkata - Delhi flight, Sitaram Yechuri, yechuri special treatment

A 14-hour long ordeal came to an end for passengers of Delhi-Kolkata Air India flight from Kolkata after their plane landed in the capital

ఎయిర్ ఇండియా విమానం.. 14 గంటల ఆలస్యం.. ప్రయాణికులకు అవస్థలు

Posted: 03/21/2016 05:24 PM IST
Air india flight to delhi lands in capital after 12 hour delay

ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులకు మరోమారు చుక్కలు చూపించింది. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీ నుంచి కేరళకు వెళ్లాల్సిన విమానంలో అనేక మంది ప్రముఖులు, ఐఎఎస్ లు, న్యాయమూర్తులు వున్నా.. ఆలస్యంగా వెళ్లిన ఉదంతాన్ని మర్చిపోకముందే మరోమారు అదే తప్పిదాన్ని పునారావృతం చేసింది. తాజగా ఆదివారం సాయంత్రం ఢిల్లీకి రావాల్సిన కోల్కతా-ఢిల్లీ విమానం(701).. 14 గంటలు ఆలస్యంగా సోమవారం ఉదయం చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

కోల్కతా విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి విమనాశ్రయంలోనే వేచి చూడాల్సి వచ్చింది. అయితే ఆదివారం సాయంత్రం మరో విమానాన్ని ఏర్పాటు చేసినా ఫైలెట్, విమాన సిబ్బంది లేకపోవడం మరింత ఆలస్యానికి కారణమైందని ప్రయాణికులు తెలిపారు. అదే సమయంలో విమానంలో పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కూడా విమానంలో ఉన్నారు. సమస్య తలెత్తిన వెంటనే ఆయనతో పాటు 50 మంది ప్రయాణికులు వేరే విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు.

ఆ తర్వాత రెండు, మూడు గంటలైనా ఎయిర్ ఇండియా అధికారులు పట్టించుకోకపోవంతో ప్రయాణికులు టెర్మినల్ లోనే ఆందోళన చేశారు. ప్రత్యామ్నయ విమాన సర్వీసును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఉన్నతాధికారులపై మండిపడ్డారు. విమానం ఆలస్యమవడంతో వృద్దులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు పడాల్సి వచ్చింది. కాగా అదే విమానంలో ఉన్న సీపీఎం నేత సీతారాం ఏచూరికి మాత్రం అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India  air india plane  14-hour delay  Kolkata - Delhi flight  

Other Articles