Chandrabau naidu serious on yanamala Ramakrishnudu for his mistake

Chandrabau naidu serious on yanamala ramakrishnudu for his mistake

Chandrababu Naidu, Yanamala Ramakrishnudu, AP, Assembly, Yanamala, Roja, MLA Roja, YSRCP MLA Roja

Chandrabau naidu serious on yanamala Ramakrishnudu for his mistake.He said that, prepare one more plan to restict roja in AP assembly.

యనమలపై చంద్రబాబు గుస్సా

Posted: 03/18/2016 02:56 PM IST
Chandrabau naidu serious on yanamala ramakrishnudu for his mistake

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణారెడ్డి మీద కోపగించుకున్నారట. ఇంత సీనియారిటీ ఉన్నా ఏం లాభం.. నా పరువుపోయింది అంటూ యనమల మీద కస్సుబుస్సులాడారట. ఇంతకీ అంతగా చంద్రబాబు నాయుడుకు కోపం తెప్పించిన విషయం ఏంటో తెలుసా..? వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా సస్సెన్షన్ అంశం. అవును యనమల చేసిన తప్పు వ్ల్ల రోజాకు ఓ అవకాశం లభించింది. తన సస్సెన్షన్ ను ప్రతిపాదిస్తూ యనమల చేసిన అసలు ప్రతిపాదనలో తప్పు ఉందని రోజా తరఫు లాయరు వాదించి... చివరకు అది తప్ప అని తేలడంతో హైకోర్టు ఆమెకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు.

సెక్షన్ 340(2)కింద ఒక సెష‌న్ కు మాత్రమే స‌స్పెండ్ చేసే ప‌వ‌ర్ ఉంటుంద‌ని మీకు తెలియ‌దా అని య‌న‌మ‌ల‌పై సీరియస్ అయ్యార‌ట‌. స్పీక‌ర్ గా చేసిన మీరు ఇంత తొంద‌ర‌పాటుగా ఎలా నిర్ణయం తీసుకుంటారు. జ‌గ‌న్ ఈ విష‌యం లేవ‌నెత్తిన‌ప్పుడైనా సెక్షన్ మార్చాల‌ని చూసుకోకుంటే ఎలా?  కేవ‌లం మ‌నం సెక్షన్ ను త‌ప్పుగా రాయ‌డం వ‌ల్లే కోర్టు త‌ప్పిప‌ట్టింది. లేదంటే స‌భానిర్ణయాన్ని హైకోర్ట్ జోక్యం చేసుకునే వీలే ఉండేది కాదు. ఈ విష‌యం అసెంబ్లీ అధికారుల‌ను అడిగినా చెప్పేవాళ్లు. అది కూడా చూసుకోకుంటే ఎలా?  మీకు తెలుస‌నే క‌దా శాస‌న‌స‌భ వ్యవ‌హారాలు మీకిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతో….రోజాకు  ఎలాగైనా చెక్ పెట్టేందుకు సిద్దంగా ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Yanamala Ramakrishnudu  AP  Assembly  Yanamala  Roja  

Other Articles