Caught On Camera: Laughing Men Batter Crocodile With Stones In Karnataka

Laughing men batter crocodile with stones in karnataka

crocodile attacked, crocodile killed in Karnataka, crocodile yadgir, crocodile stones, crocodile in north karnataka, Crocodile, Karnataka, wild life act, villagers, police, wild life protection

In a village in north Karnataka, a group of men surround a crocodile, which had strayed out of a river and on to a nearby field, and viciously beat it with stones and bricks until its head is a bloody mess.

ITEMVIDEOS: జనారణ్యంలో వన్యప్రాణి వెంటాడిన చంపిన క్రూరమృగాళ్లు..

Posted: 03/17/2016 09:02 PM IST
Laughing men batter crocodile with stones in karnataka

జనవాసాల మధ్యకు వచ్చిన పాములను కూడా విషసర్పాలని కోట్టి చంపుతారు. అదే పాములకు నాగుల చవితి, నాగుల పంచమి రోజుల్లో మాత్రం పాలు పోస్తారు. ఒకటి భయం అయితే మరోకటి భక్తి. అయితే ఈ భయం శృతిమించడం.. అందులోనూ అక్కడ పదుల సంఖ్యలో యువకులుంటే.. అక్కడికి వణ్యమృగాలు వచ్చినా మనిషి భయానికి బలి కావాల్సిందే. వర్షాలు పడక నదులు, వాగులు, వంకలు ఎండిపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి. దీంతో అవి బతుకు పోరాటంలో భాగంగా నీళ్లు లభించే ప్రాంతాలను వెతుకుంటూ వెళ్తున్నాయి. అయితే తమవారిక్కడ అది బలితీసుకుంటుందోనని అక్కడి ప్రజల్లో నెలకొన్న భయం అ ముసలి పాలిట శాఫంగా పరిణమించింది.

సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటక తూర్పు ప్రాంతంలో ఇటీవలే చోటుచేసుకుంది. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా శివనూర్ గ్రామం సమీపంలో ఓ నీటిమడుగు నుంచి మొసలి బయటకు వచ్చింది. ఆ విషయాన్ని కొందరు గ్రామస్తులు గమనించారు. మనోళ్లు గుంపుగా ఉంటే ఊరకనే ఉంటారా.. ఇక దానిపై రాళ్లతో దాడి చేయడం ప్రారంభించారు. మొసలికి చుట్టూ నిలబడి నవ్వూతూ దాన్ని కన్ ఫ్యూజ్ చేశారు. ఆ తర్వాత రాళ్లు, ఇటుకలు, చేతికి అందిన వస్తువులతో దాని తలపై కొట్టడం మొదలెట్టారు.

కొన్ని నిమిషాల్లోనే అది తీవ్రంగా  గాయపడి ఎక్కడికి కదలలేక అక్కడే ఉండిపోయింది. ఆ జనాలకు మరింత ఉషారొచ్చేసింది. తొలుత ఓ వ్యక్తి దాని తోక పట్టుకుని లాగడం చేశాడు. అయితే ఎంతకూ మొసలిని కాస్త కూడా కదల్చలేకపోయాడు. వెంటనే ఇంకో వ్యక్తి తోడవడంతో ఇద్దరూ కలిసి మొసలి తోకను పట్టుకుని కాస్త లాగేసరికి అది కదలింది. వెంటనే ఓసారి కాస్త భయపడ్డారు. ఆ తర్వాత మరోవ్యక్తి మరింత సాహసం చేస్తున్నట్లుగా మొసలిపైకి ఎక్కి దాన్ని తొక్కుతూ ఫొటో దిగాడు. మొసలిపై రాళ్లతో దాడిచేయడం ఈ పూర్తి ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ హల్ చల్ చేస్తోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు పెరిగి పోతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  crocodile  yadgir  villagers  stones  wild life act  villagers  police  

Other Articles