Javed Akhtar slams Owaisi, chants ‘Bharat Mata ki jai’ in Rajya Sabha

Javed akhtar eviscerates owaisi in stirring farewell speech

Javed Akhtar, Javed Akhtar Rajya Sabha speech, Javed Akhtar speech, Javed Akhtar Asaduddin Owaisi, Budget Session, Rajya Sabha, Rajya Sabha Session, javed akhtar slams owaisi, bharat mata ki jai, owaisi speech

Javed Akhtar slams Owaisi, chants ‘Bharat Mata ki jai’ in Rajya Sabha

ITEMVIDEOS: ఓవైసీ వ్యాఖ్యలపై మండిపడ్డ జావెద్ అక్తర్.. భారత్ మాతకీ జై అంటూ నినాదాలు

Posted: 03/16/2016 04:34 PM IST
Javed akhtar eviscerates owaisi in stirring farewell speech

రాజ్యసభ సభ్యుడిగా త్వరలో పదవీ విరమణ పొందనున్న పార్లమెంటు సభ్యుడు, బాలీవుడ్ ప్రముఖుడు జావెద్ అక్తర్ రాజ్యసభలో తన అఖరి ప్రసంగంగా రియల్ ఎస్టేటు బిల్లుపై మాట్లాడుతూ దేశం ప్రగతి సాధించాలంటే అధికార, విపక్షాలకు చెందని నేతలు బేషజాలను విడనాడి కేవలం దేశప్రజల అభ్యున్నతి కోసమే అలోచించాలని కోరారు. ఇరు వర్గాల వారు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పటి నుంచి తమ విధానాలను అనుగూణంగా నడిస్తే.. దేశం తిరోగమనం చెందుతుందని అవేదన వ్యక్తం చేశారు.

కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాల గురించి ఆలోచిందాలని, ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత అధికార ప్రతిపక్షం రెండూనూ ప్రజల హితం కోసం, దేశ ప్రగతి కోసమే అటోచించాలని ఆయన హితవు పలికారు, నరేంద్రమోడీ క్యాబినెట్ లో మంచి మంత్రులు వున్నారని, వారు కూడా తమ శక్తి కొలది మంచి పనులు చేసేందుకు దోహదం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే రానున్న ఎన్నికల కు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ వేసుకుంటూ పనిచేయడం రెండు వర్గాల వారికి సహేతుకం కాదన్నారు.

ఇక ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసుదుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ‘‘నాకు రాజ్యాంగం చెప్పలేదు కాబట్టి భారత్ మాతా కీ జై అనను అని ఒక నాయకుడు అన్నారు. ఆయన జాతీయ నేత కాదు. హైదరాబాద్‌లోని ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు. మరి షేర్వానీ, టోపీ ధరించాలని రాజ్యాంగం చెప్పలేదు కదా ఎందుకు ధరిస్తున్నారు’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు భారత్ మాతా కీ జై అని నినాదించారు. అదే సమయంలో భారత్ మాతాకీ జై అని పలకడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్‌కు వెళ్లాలని వచ్చిన విమర్శలు కూడా సరైనవి జావెద్ అక్తర్ అభిప్రాయపడ్డారు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Javed Akhtar  Rajya Sabha  Asaduddin Owaisi  Budget Session  Farewell Speech  

Other Articles