ఆతిథ్య హోదాలో టీమ్ ఇండియాకు టీ20 ప్రపంచకప్లో చేదు పరాజయం. దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయిన వేళ అభిమానుల ఆశలను నిలువునా ముంచుతూ ధోనీసేన ఆరంభమ్యాచ్లోనే దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. పొట్టి ఫార్మాట్లో తమకు ఎదురేలేదన్నట్లుగా దూసుకొచ్చిన ధోనీసేనకు సొంతగడ్డపై తొలి మ్యాచ్లోనే ఊహించని షాక్ ఎదురైంది. నిన్న న్యూజిలాండ్తో జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్లో టీమ్ ఇండియా 47 పరుగుల తేడాతో చిత్తయింది.
ప్రముఖ న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రో కి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రపంచ కప్ స్టార్ట్ అయ్యింది. అసలు సిసలైన T20 మజా మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాటింగ్ కి ఎంతో కాన్ఫిడెంట్ తో దిగింది. స్పిన్ ఆడటంలో న్యూజిలాండ్ వీక్ అని తెలిసిన ధోనీ తెలివిగా అశ్విన్ ని బౌలింగ్ కి దింపాడు. న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ ధోని నిర్ణయం తప్పు అంటూ మొదటి బంతినే సిక్సర్ గా మలిచాడు. ఆతర్వాత చెలరేగిన అశ్విన్ స్పిన్ టర్న్ కి వెంటనే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంతే, స్టేడియం హోరెత్తిపోయింది. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ వరుసగా క్యూ కట్టారు. ఆండర్సన్, టేలర్ మాత్రమే కాసేపు రన్స్ కొట్టారు. కానీ దురదృష్టవశాత్తూ టేలర్ ని రైనా అద్భుతంగా రన్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ కి ఇక్కడే సరైన దెబ్బతగిలింది. ఆ జట్టు కెరియర్ లోనే తక్కువ స్కోర్ (126) రన్స్ చేసింది.
అ తర్వాత బ్యాటింగ్ కి దిగిన టాప్ ఇండియన్ ఆర్డర్ , వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్స్ అందరూ వరుసగా క్యూ కట్టారు. ట్వంటీ ట్వంటీలలోనే అతి తక్కువ స్కోర్ కొట్టలేక 79 పరుగులకే చతికిలబడ్డారు. ఒకవైపు కోహ్లీ తనదైన స్టైల్లో క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడుతుంటే మిగతా బ్యాట్స్ మెన్స్ అందరూ ఈ మ్యాచ్ ఆడటం మా వల్ల కాదు అనుకున్నారో, లేదా వరల్డ్ కప్ ఆడుతున్నామని మర్చిపోయారో తెలీదు కానీ పెవిలియన్ కి క్యూ కట్టారు. బహుశా ఇది ఐపియల్ ఫ్రెండ్లీ మ్యాచ్ అనుకున్నారేమో. కొండంత ఆశతో స్టేడియంకు వచ్చిన ఆడియన్స్ కి గుండెల్లో గునపాలు గుచ్చారు. సాట్రన్, సోధీలు టర్న్ తో ఇండియన్ బ్యాట్స్ మెన్ కి చుక్కలు చూపించారు. మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ చెప్పుకోవాలి కాబట్టి, సోధీ వేసిన మొదటి బంతికి కోహ్లీ కీపర్ కి క్యాచ్ ఇవ్వడంతోనే మ్యాచ్ చేజారిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more