Won’t say Bharat Mata ki Jai: Owaisi

Won t say bharat mata ki jai owaisi

Owisi, bharath Mata ki Jai, RSS, Mohan Bhagath, AIMIM

Rejecting RSS chief Mohan Bhagwat’s suggestion for infusing patriotism, AIMIM leader Asaduddin Owaisi has said he will not chant ‘Bharat Mata ki Jai’ even if a knife is put to his throat, prompting Shiv Sena to tell him on Monday that he should go to Pakistan.

ITEMVIDEOS: భారత్ మాతా కీ జై అనను! ఏంచేస్తారు?

Posted: 03/15/2016 07:17 AM IST
Won t say bharat mata ki jai owaisi

తాను భారత్ మాతాకీ జై అని నినదించే ప్రసక్తే లేదని మజ్లిస్ నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. దేశభక్తి పెంపొందించేలా ప్రస్తుత తరాలకు భారత్ మాతకు జై అనే నినాదాలు బోధించాలని ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ సూచనను ఒవైసీ తిరస్కరించారు. తాను ఆ నినాదం చేయను అని.. మీరు ఏం చేస్తారు భగవత్ సాహబ్? అని ఒవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఉద్గిర్ తెహసిల్‌లో నిన్న రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడారు. తన గొంతుపై కత్తిపెట్టినా తాను ఆ నినాదం చేయబోనని సభికుల హర్షధ్వానాల మధ్య తేల్చి చెప్పారు. అందరూ భారత్ మాతాకీ జై అన్న నినాదం చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదని ఒవైసీ పేర్కొన్నారు.

భారత సార్వ భౌమాధికారాన్ని సాక్షాత్తూ ఒక భారత పార్లమెంటుభ్యుడు కించపరిచే విధంగా మాట్లాడినా మన రాజ్యాంగంలో శిక్షలు లేవా?లేక వాటిని అమలుచేసే దమ్ములు ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలకు లేవా? లౌకిక రాజ్యమంటూ మనం సంకలు గుద్దుకుంటూ ఉంటే,ఇలాంటి వారిని ఉపేక్షిస్తూ ఉంటే మన దేశంలో ఉగ్రవాదులు,మతోన్మాదులు తలెత్తుకొని గర్వంగా సంచరించరా?ఉగ్రవాదుల దాడులలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు,వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాలు ప్రకటించడమే మనం వారికిచ్చే గౌరవమా?ఇలాంటి అసమర్ద దేశమా మనది అని ఇలాంటి సంఘటనలు జరగినప్పుడు సిగ్గుతో తల వాలిపోతోంది. భారత అత్యున్నత న్యాయస్ధానం,భారత ప్రధమ పౌరుడు,భారత ప్రసార మాధ్యమాలు ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Owisi  bharath Mata ki Jai  RSS  Mohan Bhagath  AIMIM  

Other Articles