Turkish government 'blocks Twitter and Facebook

Turkish government blocks twitter and facebook

facebook, twitter, Ban, Turkey

The Turkish authorities have reportedly imposed media restrictions and residents are describing limited access to social media in the aftermath of an explosion in the capital, Ankara. Some broadcast media were reportedly subject to a ban on covering aspects of the explosion, suspected to be a car bomb.

ఫేస్ బుక్, ట్విట్టర్ బ్యాన్

Posted: 03/14/2016 04:19 PM IST
Turkish government blocks twitter and facebook

సోషల్ మీడియా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి అడిక్షన్ గా మారింది. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అంతా సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతోంది. అయితే కొన్ని దేశాల్లో సోషల్ మీడియా మీద నిర్భందాలు కొనసాగుతున్నాయి. క్యుబా, ఉత్తర కొరియాలాంటి దేశాల్లో యుట్యూబ్ తో సహా అన్నింటి మీద కూడా నిర్భందం ఉంది. అయితే తాజాగా ఇదే బాటలో మరో దేశం కూడా అడుగులు వేసింది. ఒక వైపు సోషల్ మీడియా ఇంటర్నెట్ ను అందరికి దగ్గర చేస్తుంటే. కొన్ని దేశాలు మాత్రం వాటి మీద పరిమితులు విధిస్తున్నాయి.

సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లపై టర్కీ ప్రభుత్వం నిషేధం విధించింది. రాజధాని అంకారాలో నిన్న రాత్రి ఉగ్రవాదులు వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 34 మంది పౌరులు మరణించగా..అధిక సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో వైరలయ్యాయి. దీంతో వాటిపై నిషేధం విధిస్తున్నట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఫోటోల వల్ల ఫేస్‌బుక్, ట్విట్టర్లను ఉపయోగించడం ఇబ్బందిగా మారిందని నెటిజన్లు చెప్పడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  twitter  Ban  Turkey  

Other Articles