Hilarious Photoshopped BJP Publicity Pictures

That is pm modi fake photo declares officials

narendra modi, photo, Morphing, bjp, rss, rti,

Modi’s head photoshopped on someone’s picture to showcase him as someone of humble background.

మోడీ గారీ ఫోటో.. అసలుదా..? నకిలీదా..? మీరే తేల్చండీ..

Posted: 03/11/2016 08:24 PM IST
That is pm modi fake photo declares officials

పుక్కిటి పురాణాలని వినే ఉంటారు కదా ! మనకు చిన్నప్పుడు ఇళ్ళల్లో పెద్దవాళ్ళు అలాంటి కథలు చాలా వినిపించేవాళ్ళు. ఎగిరే గుర్రం గురించి , నడిచే దయ్యాలగురించి చాలా కథలే విన్నాం. మళ్ళీ అలాంటి కథలు నరేంధ్ర మోడీ గురించి విన్నాం, వింటున్నాం. ఆయన ఆరెస్సెస్ కార్యాలయంలో ఊడ్చేవాడని.. చాయ్ అందించేవాడని... గుజరాత్ ను న్యూయార్క్ లా మార్చేశాడని ఇలా చాలా కథలు విన్నాం. అందుకు రుజువులుగా ఆయన భక్తులు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను కూడా ప్రచారంలో పెట్టారు.

అయితే అవన్నీ అసత్యాలని, అవి ఫోటో షాప్ ద్వారా తయారు చేసిన ఫోటోలని... అదే సోషల్ మీడియాలో మరికొందరు నిపుణులు రుజువులతో సహా బహిర్గత పర్చారు. అయితే అలా సంతృప్తి చెందని అహ్మదాబాద్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త ఒకరు ఆర్టీఐ చట్టాన్ని ఆశ్రయించారు. 1988లో ఆరెస్సెస్‌ కార్యలయంలో సాధారణ కార్యకర్తగా ఉన్న మోడీ అంటూ... కార్యాలయాన్ని ఊడుస్తున్న మోడీ అంటూ ఆయన మద్దతుదారులు సామాజిక మీడియాలో ప్రచారంలో పెట్టిన ఫోటో నిజమైనదా కాదా అని ఆ ఆర్టీఐ కార్యకర్త అధికారులను అడిగారు. అయితే ఆ ఫోటో నకిలీదని అధికారులు లిఖితపూర్వకంగా తేల్చి చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  photo  Morphing  bjp  rss  rti  

Other Articles