Need 4 weeks to pay Rs 5 cr fine to green tribunal

Need 4 weeks to pay rs 5 cr fine to green tribunal

Green Tribunal, Sri Sri Ravishankar, Art of living, Yamuna River, the National Green Tribunal

Art of Living, which describes itself as a “non-governmental organisation”, has asked the National Green Tribunal (NGT) to give them at least four weeks to deposit the Rs 5 crore fine because of a lack of immediate funds.

ఐదు కోట్లు కట్టడానికి నాలుగువారాలు కావాలట

Posted: 03/11/2016 01:33 PM IST
Need 4 weeks to pay rs 5 cr fine to green tribunal

ఈ రోజు సాయంత్రం వరకు ఐదు కోట్ల రూపాయలు చెల్లించడం తమ వల్ల కాదు అంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్ కు స్పష్టం చేసింది. తమకు నాలుగు వారాల టైం కావాలని, నాలుగు వారాల్లోగా ఐదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెల్లడించింది. కల్చర్ ఫెస్టివల్ ఆరంభం అయ్యేలోపు అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కోర్టుకు పేర్కొంది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, ఇంత త్వరగా అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా పర్యావరణవేత్తలు మరోసారి ప్రపంచ సంస్కృతిక ఉత్సవాన్ని నిలిపేవేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు.

నిన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకుడు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ తాను జరిమానా కట్టనని, జైలుకు పోయేందుకు కూడా తాను సిద్దం అని స్పష్టం చేశారు. కానీ తెల్లారేసరికి ఇలా తమ వల్ల కాదు. కాస్త టైం కావాలని కోర్టును కోరడం విశేషం. ఇక శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ నిర్వహిస్తున్న ప్రపంచ సంస్కృతి ఉత్సవంపై ఇవాళ కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తాయి. కల్చర్ ఫెస్టివల్ వల్ల దిల్లీ నిర్వీర్యంగా మారిందని జేడీయూ నేత శరద్ యాదవ్ అన్నారు. జరిమానా కట్టను అని శ్రీశ్రీ అంటున్నాడు, ఆయన చట్టానికి అతీతుడా అని శరద్ ప్రశ్నించారు. కల్చర్ ఈవెంట్‌తో పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles