Vijay Mallya left India on 2 March

Vijay mallya left india on 2 march

VijayMalya, KingFisher, banks, Supreme Court

India's own Richard Branson, Vijay Mallya is in the news of late for all wrong reasons. The liquor baron has taken the banking industry, the regulators and the judicial system for a ride by delaying the repayment of Rs 9,000 crore loans (including interest) taken by his now-defunct Kingfisher Airlines. But beyond all the controversies surrounding his financial commitments to banks as an industrialist, Mallya also has the face of a parliamentarian.

దేశం నుండి మాల్యా పరార్

Posted: 03/10/2016 09:16 AM IST
Vijay mallya left india on 2 march

దేశంలో నిర్లక్ష ధోరణి, బడా బాబులకు ప్రభుత్వాలు ఎలా కొమ్ముకాస్తాయో అన్నట్లు మరోసారి మాల్యా వ్యవహారం నిరూపించింది. తమకు ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొడుతున్నారన్న ఆరోపణలతో మాల్యా మీద బ్యాంకులకు కోర్టుకెక్కాయి. కాగా మాల్యా విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నేతృత్వంలోని కన్సార్టియం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వారం క్రితమే ఆయన దేశం వదిలి విదేశీ విమానం ఎక్కేశాడని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ నెల 2న మాల్యా దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. మాల్యా తీసుకున్న రుణాల కంటే విదేశాల్లో ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని ఏజీ కోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బెంచ్ మాల్యాకు నోటీసులు జారీచేసింది. వచ్చే రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనను కోర్టు ఆదేశించింది. ఈ నోటీసులను మాల్యాకు ఈ-మెయిల్ ద్వారా పంపినట్లు తెలుస్తున్నది. మాల్యా బ్రిటన్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో అక్కడి భారత హైకమిషనర్‌కు, సిబ్బందికి నోటీసులను మెయిల్ చేశారు.

అయితే గతంలో కూడా బడా బాబులకు అప్పటి ప్రభుత్వాలు కొమ్మెుకాశాయని... ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశం వదిలి ప్రశాంతంగా వెల్లిపోయిన మాల్యాకు ఇప్పుుడు మాత్రం వెనక్కి పంపిస్తామని ప్రభుత్వం నివేదించడం తర్వాత ఆనక చెయ్యలేకపోవడం జరుగుతాయని కొంత మంది విమర్శిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారినుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. మరి విజయ్ మాల్యా లాంటి బడా బాబుల నుండి కూడా వసూలు చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VijayMalya  KingFisher  banks  Supreme Court  

Other Articles