TRS Won the Muncipal elections in Khammam, Warangal and Achampet

Trs won the muncipal elections in khammam warangal and achampet

TRS, Muncipal Elections, Muncipalities, Achampet, warangal, Khammam

TRS Won the Muncipal elections in Khammam, Warangal and Achampet. TRS party clean sweep in Achampet Mincipal elections. TSP did not win even one seat in three muncipalities.

మున్సిపోల్స్ లో టిఆర్ఎస్ గ్రేట్ విక్టరీ

Posted: 03/09/2016 01:40 PM IST
Trs won the muncipal elections in khammam warangal and achampet

తెలంగాణలో టిఆర్ఎస్ కు ఎదురులేదని మరోసారి నిరూపించారు తెలంగాణ ప్రజలు. ఖమ్మం కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్, అచ్చంపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ భారీ విజయం సాధించింది. టిఆర్ఎస్ పార్టీ దెబ్బకు మిగిలిన పార్టీల డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వరంగల్ లో బిజెపి పార్టీ ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. టిడిపి ఎక్కడా కూడా బోణీ కొట్టలేకపోయింది. అచ్చంపేటలో మొత్తం 20కి 20 సీట్లు టిఆర్ఎస్ సొంతం చేసుకుంది. అచ్చంపేటలో కాంగ్రెస్ 13, టీడీపీ 4, బీజేపీ 4, స్వతంత్రులు 17 మంది పోటీ చేశారు. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో 18,614 ఓట్లకు గానూ 13,193 ఓట్లు పోలయ్యాయి. 70.88 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లకు గానూ టీఆర్‌ఎస్ 44 డివిజన్లలో గెలుపొందింది. కాంగ్రెస్ 4, బీజేపీ 1, ఇతరులు 9 డివిజన్లలో గెలుపొందారు. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో 6,44,098 ఓట్లకు గానూ.. 3,87,890 ఓట్లు పోలయ్యాయి. 60.31 శాతం పోలింగ్ నమోదైంది. 58 డివిజన్లకు 398 అభ్యర్థులు బరిలో దిగారు. టీఆర్‌ఎస్ నుంచి 58, బీజేపీ 57, టీడీపీ 51(వీరిలో నలుగురు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు), కాంగ్రెస్ 49, సీపీఎం 11, సీపీఐ 6, వైసీపీ 11, బీఎస్పీ 1, స్వతంత్రులు 154 మంది పోటీ చేశారు.

ఖమ్మం కార్పొరేషన్ లో 50 డివిజన్లకు గానూ 34 డివిజన్లలో టీఆర్‌ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ 10, సీపీఐ 2, సీపీఎం 2, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో 2,65,710 ఓట్లకు గానూ 1,79,827 ఓట్లు పోలయ్యాయి. 67.68 శాతం పోలింగ్ నమోదైంది. 50 డివిజన్లకు 291 మంది బరిలో దిగారు. టీఆర్‌ఎస్ నుంచి 50 మంది, కాంగ్రెస్ 42, వైసీపీ 48, టీడీపీ 48, సీపీఎం 40, సీపీఐ 8, బీజేపీ 9, స్వతంత్రులు 46 స్థానాల్లో పోటీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Muncipal Elections  Muncipalities  Achampet  warangal  Khammam  

Other Articles