India won the asia t20 cup

India won the asia t20 cup

India, Cricket, Team India, Dhoni, Kohli, Bangladesh

Team India won the asia t20 cup in merpur. Bangladesh scored 120 runs Indian team beat that score.

టి20 ఆసియా కప్ మనదే..

Posted: 03/07/2016 07:02 AM IST
India won the asia t20 cup

తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్‌లోనూ భారత్ ఆధిపత్యమే సాగింది. ఆసియా కప్‌లో భారత్ ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఎనిమిది వికెట్లతో నెగ్గిన ధోనీసేన ఆతిథ్య బంగ్లాదేశ్‌ ఆశలపై నీళ్లు చల్లుతూ మరోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. వర్షం అంతరాయం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బంగ్లా నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ధోనీసేన రెండు వికెట్లు కోల్పోయి ఏడు బంతులుండగానే విజయాన్నందుకుంది. సిరీస్‌లో ఫామ్‌లేమితో సతమతమైన ధవన్ ఎట్టకేలకు ఫైనల్లో జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లను చితకబాదుతూ ధవన్(44 బంతుల్లో 60) అర్ధసెంచరీతో జట్టు చిరస్మరణీయ గెలుపులో పాలుపంచుకున్నాడు.

ధావన్‌కు తోడు అద్భుతఫామ్‌తో అలరిస్తున్న కోహ్లీ(41నాటౌట్), కెప్టెన్ ధోనీ(20నాటౌట్) జతకలవడంతో టీమ్‌ఇండియా అలవోక విజయాన్ని నమోదు చేసుకుంది. ధవన్, కోహ్లీ, ధోనీ ధాటికి బంగ్లా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌తో ఫామ్‌లోకొచ్చిన ధవన్ తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఓ భారీ సిక్స్‌తో అలరించాడు. మ్యాచ్ ఫినిషర్‌గా ముద్రపడ్డ ధోనీ తనదైన శైలిలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో ముగింపు పలికాడు. 13వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ 6 బంతుల్లో ఓ ఫోర్, రెండు ట్రేడ్‌మార్క్ సిక్స్‌లతో విజృంభించాడు. ఇక బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ఆల్‌అమిన్ హుస్సేన్‌లకు చెరో వికెట్ దక్కింది. అర్ధసెంచరీతో జట్టు గెలుపులో కీలకమైన ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా,షబ్బీర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Cricket  Team India  Dhoni  Kohli  Bangladesh  

Other Articles