PM Modi pulls up Rahul Gandhi, questions 'Make in India' jibe

Pm modi pulls up rahul gandhi questions make in india jibe

Modi, Parliament, Rahul Gandhi, Make In India

In a point by point rebuttal to the allegations levelled by Congress vice-president Rahul Gandhi against the policies formulated by the BJP led NDA regime, Prime Minister Narendra Modi on Thursday criticised the former for mocking the Make in India initiative.

మేకిన్ ఇండియా మీద జోకులా..? మోదీ

Posted: 03/03/2016 02:27 PM IST
Pm modi pulls up rahul gandhi questions make in india jibe

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి మటకు సమాధానమిచ్చారు. అన్నింటికన్నా కూడా మేకిన్ ఇండియా పేరుతో మోదీ సర్కార్ పెద్ద బబ్బర్ షేర్ ను తయారు చేసిందని రాహుల్ గాంధీ హాస్యాస్పదంగా అన్నారు. దాని మీద మోదీ కౌంటర్ వేశారు. నమిచ్చారు.  పార్లమెంటు ఎలానడవాలన్న అంశంపై రాష్ట్రపతి  పలు సూచనలు చేశారని, వాటిని ఆచరణలో  పెట్టేందుకు  కృషిచేయాలన్నారు. ఇందుకు స్పీకర్ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  మేక్ ఇన్ ఇండియాలో లోపాలు ఉండవచ్చునని,  కానీ, అపహాస్యం చేయవద్దన్నారు. నిబంధనలు పాటిస్తే.. చర్చలు మరింత ఫలవంతమవుతాయని గతంలో  రాజీవ్ గాంధీ  చేసిన సూచనలను  ఈ సందర్భంగా ప్రధాని  గుర్తు చేశారు.  పథకం మంచిది కాదని  విమర్శించడం కాదని, తగిన సూచనలు చేయడం , పరిష్కారం చూపడం కూడా  ప్రతిపక్షం బాధ్యత అని  మోదీ అన్నారు.

పార్లమెంటు లో ప్రతి ఒక్కసభ్యుడూ సభామర్యాదలు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో బిల్లులు ఆమోదం పొందకుంటే ..అంతుకు అడ్డుతగిలితే.. ప్రజలకే నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.  పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి..ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానమిచ్చారు.  మన విద్యావ్యవస్థ ఆందోళన కల్గిస్తోందని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. మార్చ్8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు పార్లమెంటులో మహిళలే మాట్లాడాలని ప్రధాని  పేర్కొన్నారు. మహిళల సాధికారతకు అన్నివిధాలా కృషిచేస్తామని ప్రధాని తెలిపారు.   ప్రతిపక్షాల సహకారం,  అవసరమని, ప్రతిపక్షాలు, అధికారపక్షం.. భుజం.. భుజం కలిపి దేశాన్ని ముందుకు తీసుకువెళ్తామని  పిలుపు నిచ్చారు.  తనపై ప్రతిపక్షనాయకులు, రాహుల్ గాంధీ చేసిన విమర్శలను  ప్రధాని తేలిగ్గా కొట్టివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Parliament  Rahul Gandhi  Make In India  

Other Articles