Andhra Pradesh people to get sand free of cost

Andhra pradesh people to get sand free of cost

Sand, AP, Andhrapradesh, Chandrababu, cabinet, Sand for Free

For the first time in the country, people in Andra Pradesh can avail sand free of cost as the state Cabinet today decided to include it in the list of essential commodities. A decision in this regard was taken at a meeting of the state Cabinet which gave its nod to a new policy. The state government is expected to forego a revenue of over Rs 200 crore, Agriculture Minister P Pulla Rao told reporters.

ఏపిలో ఉచితంగా ఇసుక

Posted: 03/03/2016 09:56 AM IST
Andhra pradesh people to get sand free of cost

ఆంధ్రప్రదేశ్ లో ఇసుకను ఉచితంగా పంపిణీ చేయాలని ఏపి సర్కార్ నిర్ణయించింది. అయితే ఉచితంగా ఇస్తారు కదా అని ఎక్కడపడితే అక్కడ ఇసుకను తోడేస్తామంటే మాత్రం కుదరదు. అలా చేస్తే మాత్రం కేసులతో లోపలేస్తారు. తాజాగా ఉచితంగా ఇసుక పంపిణీ అమలు మీద రాష్ట్ర కేమినెట్ ఆమోదించింది. ఆధార్‌ సహా మరే ఇతర గుర్తింపు కార్డులు చూపకున్నా... అవసరమైన వారు, అవసరమైనంత మేరకు ఉచితంగా ఇసుక తవ్వుకోవచ్చు. ఇది తక్షణం అమలులోకి వచ్చింది. నెలరోజులపాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత దీనిపై పకడ్బందీగా మార్గదర్శకాలు అమలు చేస్తారు. ఎక్కడ, ఏ మేరకు ఇసుక తవ్వకాలకు అనుమతించాలనే విషయంపై కేబినెట్‌ భేటీలో వివరంగా చర్చించారు.

ఇసుకను నిత్యావసర సరుకుల చట్టం-1955 పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. వంతెనలు, రిజర్వాయర్‌ల దగ్గర, నోటిఫై చేసిన ప్రాంతాల్లో, పర్యావరణానికి హాని కలిగేలా ఇసుకను తవ్వరాదని మంత్రివర్గం నిర్దేశించింది. అవసరానికి మించి తవ్వుకున్నా, నిల్వ ఉంచినా, ఇతర రాషా్ట్రలకు తరలించినా, అనుమతిలేని ప్రాంతాల్లో ఇసుకను తవ్వినా నేరంగా పరిగణిస్తారు. గోతులు పూడ్చడానికి ఇసుకను వాడినా నేరమే. దీనికి కఠిన శిక్షలు తప్పవు. అక్రమార్కులపై అవసరమైతే పి.డి. చట్టాన్ని కూడా ప్రయోగిస్తారు. వాహనాలు సీజ్‌ చేస్తారు. ఇసుక తవ్వుతుండగా నీటి ఊట కనిపిస్తే... అక్కడితో తవ్వకం నిలిపివేయాలి. ఇసుక తవ్వకాల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటవుతుంది. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తారు. ఇసుకను ఉచితంగా తవ్వుకునేందుకు నెలరోజులపాటు వీలు కల్పించారు. ఈ నెల రోజులపాటు పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను, పర్యవసానాలను పరిశీలించి... పకడ్బందీగా కొత్త విధానానికి మార్గదర్శకాలను రూపొందిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sand  AP  Andhrapradesh  Chandrababu  cabinet  Sand for Free  

Other Articles