NASA astronaut Scott Kelly returns to Earth after 340 days in space

Nasa astronaut scott kelly returns to earth after 340 days in space

NASA, Scott Kelly , earth, Astronaunt

NASA astronaut Scott Kelly is back on Earth after a record-setting 340 consecutive days in space, the most in NASA's history. The space explorer landed in Kazakhstan at 11:26 p.m. ET on March 1 after spending nearly a full year on the International Space Station in an effort to understand how the human body responds to long periods of weightlessness.

340 రోజుల తర్వాత భూమి మీదకు...

Posted: 03/02/2016 04:54 PM IST
Nasa astronaut scott kelly returns to earth after 340 days in space

అవును, 340 రోజుల తర్వాత భూమి మీదకు వచ్చాడు అతడు. అంతరిక్షంలో 340 రోజులు గడిపిన నాసా వ్యోమోగామి ఈ ఉదయం సోయుజ్ క్యాప్సుల్స్ ద్వారా కజికిస్థాన్ లో దిగాడు. గత మార్చిలో ప్రారంభమైన అంతరిక్ష యానంలో ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 340 రోజులు గడిపారు. ఆయన విజయవంతంగా తిరిగి రావడంతో అంగారక గ్రహానికి వ్యోమగాములను పంపించడంలో నాసా ఓ అడుగు ముందుకు వేసినట్లే చెప్పుకోవచ్చు. వరుసగా 340 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన తొలి అమెరికన్ ఆయనే. రష్యా వ్యోమగామి వాలేరి పోల్యాకోవ్ 437 రోజులు మిర్ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఇది ఇప్పటి వరకు అంతర్జాతీయ రికార్డు.

కెల్లీతో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సిబ్బందిలో ఒకరైన మిఖాయిల్ కొర్నియెంకో అంతరిక్షంలో గడిపారు. వీరు రోదసిలో 144 మిలియన్ మైళ్ళు ప్రయాణించారు. ప్రపంచాన్ని 5,440 సార్లు చుట్టివచ్చారు. 10,880 సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూశారు. అంతరిక్షంలో సూర్యోదయం ఫొటోను కెల్లీ చివరిసారిగా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రయాణం పూర్తి కాలేదని, భూమిని మళ్ళీ కనుగొంటున్నానని, తనను ఫాలో అవమని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. మానవ శరీరం పరిమితులు ఏమిటో తెలుసుకోవాలని నాసా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇది దోహదపడుతుంది. దీనివల్ల ఎక్కువ కాలం అంతరిక్షంలో ప్రయాణించగలిగే వ్యోమగాములను అంగారక గ్రహానికి పంపించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి నాసాకు వీలవుతుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NASA  Scott Kelly  earth  Astronaunt  

Other Articles