Staffer Organises Wedding in Hospital Premises, Patients Abandoned

Government hospital with patients turns into marriage hall in bulandshahr for staff

Patients, Bulandshahr Government hospital, Marriage, Hospital Employee daughter marriage, Hospital doctors, nursing staff, hospital staff, Uttar Pradesh,

Chaos reigned supreme and patients of a hospital were left to fend for themselves at a government hospital in Bulandshahar of Uttar Pradesh on February 28, after a hospital staffer organised his daughter's wedding in the hospital premises.

పెళ్లిమండపంలా మారిన ప్రభుత్వాసుపత్రి.. స్టెపులేసిన వైద్యులు, సిబ్బంది.. రోగులకు అవస్థలు

Posted: 03/01/2016 01:39 PM IST
Government hospital with patients turns into marriage hall in bulandshahr for staff

ఆయన ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి, అంతేకాదు సదరు ఆసుపత్రిలో గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తూ.. అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తుంటాడు. దీంతో పాటు స్థానికంగా సదరు ఉద్యోగికి రాజకీయంగా కూడా మంచి పలుకుబడి వుంది. ఇకనేం.. ఆసుపత్రిలో తాను అడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగుతుంది. అది ఎంతలా అంటే నిత్యం రోగులతో, వారి వ్యాధులకు చికిత్స చేస్తూ నిశబ్ధంగా వుండే ఆసుపత్రి.. సదరు ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి కూతురి వివాహం కోసం ఏకంగా కళ్యాణ మండపంలా, అదేనండీ ఫంక్షన్ హాల్ లా మరింది. దీనికి అస్పత్రి అధికారులు, ఉన్నతాధికారులు కూడా అనుమతించారట. అంతేకాదు వారు ఈ పెళ్లికి హాజరై.. జోరుగా వస్తున్న పాటలకు రంజుగా స్టెఫులేసి మరీ అదరగోట్టారట..

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఫిబ్రవరి 28న జరిగిన ఈ బాగోతం ఆలస్యంగా లుగులోకి వచ్చింది. ఆస్పత్రి ఉద్యోగి ఒకరు తన కూతురు వివాహాన్ని ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించాడు. వివాహ వేడుకల్లో భాగంగా పాటలు, డాన్సులు హోరెత్తించడంతో రోగులు అసౌకర్యానికి గురయ్యారు. వైద్యులు, నర్సులతో సహా సిబ్బంది అంతా పెళ్లికి వెళ్లిపోవడంతో రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆస్పత్రి సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని చికిత్స పొందుతున్న వృద్ధుడు ఒకరు వాపోయారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ప్రసవం కోసం ఓ నిండు చూలాలు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles