Modi appriciates Finance Minister Arun Jality

Modi appriciates finance minister arun jality

Modi, Arun Jaitly, Budget, Budget 2016, NDA, farmers, Agriculture

Modi appriciates Finance Minister Arun Jality for Union Budget2016-17. He said that this budget wll support the Indian economy.

బడ్జెట్ పై మోదీ హర్షం.. జైట్లీకి అభినందన

Posted: 02/29/2016 04:17 PM IST
Modi appriciates finance minister arun jality

ఎన్నో ఆశలతో, ఊరించిన 2016-17 బడ్జెట్ మోదీ విజన్ కు బాటలు వేసింది. ఈసారి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు, వ్యవసాయ రంగం అభివృద్ధిపై బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టిసారించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.  ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని తెలిపారు.2018కల్లా దేశంలోని ప్రతీ గ్రామానికి విద్యుత్ సరఫరా అందజేస్తామన్నారు. 2019కల్లా దేశంలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తామని స్పష్టం చేశారు. మహిళలు, రైతులు, గ్రామీణ భారతంపై బడ్జెట్‌లో ప్రధానం దృష్టిసారించామన్నారు. సామాన్యుల జీవితాల్లో భారీ మార్పులొస్తాయని తెలిపారు.

ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అద్దె ఇంట్లో ఉండేవారికి ఇన్‌కం టాక్స్ మినహాయింపు ఇస్తామన్నారు. దేశంలో పేదవాడిపై అనేక రాజకీయాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో పేదరికాన్ని తగ్గించేందుకు పథకాలు ప్రకటించారని వివరించారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయరంగానికి అధికంగా కేటాయింపులు జరిపారు.

వ్యవసాయరంగానికి ఊతానిస్తు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు ఇవే..
* సాగునీటి ప్రాజెక్టులకు రూ.86,500 కోట్లు
* 28.5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొస్తాం
*గత ఏడాదితో పోలిస్తే  రూ.50వేల కోట్లు వ్యవసాయ రుణాల పెంపు
* సాగునీటి రంగానికి రూ.20వేల కోట్లు
* అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఈ-మార్కెట్ల సదుపాయం
* ఈ ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.9లక్షల కోట్లు
* ప్రధాని రహదారుల పథకానిఇ రూ.19వేల కోట్లు
* వ్యవసాయేతర రంగాల్లో ఆదాయల పెంపుకు కృషి
వ్యవసాయ, మౌలిక వసతుల రంగంపై అదనపు సెస్సు
*విత్తనాల నిల్వకు రూ.900 కోట్లు
* రుణాల మాఫీకి రూ.15వేల కోట్లు
* రానున్న మూడేళ్లలో ఐదు లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ పంటలు
*వ్యవసాయానికి రూ.35, 984 కోట్లు
* ఆథార్ కార్డు కింద అందరికీ పథకాలు
*గ్రామీణ ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ
* నామమాత్రపు ప్రీమియంతో ప్రధాని పంటల బీమా
*దేశ ఆహార భద్రతకు వెన్నెముకలు రైతులే
*వెనుకబడ్డ వర్గాల కుటుంబాలకు మూడు పథకాలు ప్రవేశం
* 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం
* సంక్షేమం, గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఖర్చు పెంపు
* నీటి లభ్యత పెంచే విధంగా చర్యలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Arun Jaitly  Budget  Budget 2016  NDA  farmers  Agriculture  

Other Articles