Karnataka CM's watch is a stolen one: HD Kumaraswamy

Siddus hublot a stolen gift kumaraswamy

karnataka Chief Minister Siddaramaiah, siddaramaiah expensive wristwatch, siddaramaiah, karnatak chief minister, karnataka cm siddaramaiah, siddaramaiah watch, rolex watch, watch controversy, hublot watch, siddaramaiah, rolex, Rahul Gandhi, Karnataka, Janata Dal, HD Kumaraswamy

State JD(S) president HD Kumaraswamy said he stumbled upon the truth behind chief minister Siddaramaiah's expensive watch, following a call from physician Sudhakar Shetty -- purportedly the owner of the item -- who wanted to share some details about it with him.

ముఖ్యమంత్రి చేతికి చోరీ రిస్ట్ వాచ్..? గిప్ట్ కాదంటూ విపక్షం అరోపణలు

Posted: 02/27/2016 12:24 PM IST
Siddus hublot a stolen gift kumaraswamy

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతి గడియారం ఆయన చుట్టూ రోజుకో వివాదాన్ని రాజేస్తుంది. 70 లక్షల రూపాయల విలువ చేసే వాచీ తనకు గిఫ్ట్ గా లభించిందంటూ.. దానిని తనకు ఎవరు బహుకరించారో కూడా తెలియదదంటూ ముందుగా చెప్పిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, అది సెకండ్ హ్యాండ్ దని, రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేకెత్తించిన దానిని ఇక తాను ధరించనని చెప్పినా.. విపక్షాలు మాత్రం ఆయనను వదిలిపెట్టడం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈ విషయంలో మరో బాంబ్ పేల్చారు.

ఆ వాచీ ఇంతకుముందు చోరీకి గురైందని ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి ఇంట్లో చోరీకి గురైన వాచ్, సిద్ధరామయ్య ధరిస్తున్న లగ్జరీ వాచ్ ఒకేలా ఉన్నాయంటూ సుధాకర్ శెట్టి స్నేహితుడొకరు తనకు స్వయంగా చెప్పారంటూ వెల్లడించారు. అయితే సుధాకర్ శెట్టి మాత్రం ఇందులో నిజం లేదని, తన ఇంట్లో చోరీకి గురైనవాచ్, సీఎం సిద్ధరామయ్య వద్ద ఉన్న వాచ్ వేర్వేరని చెబుతున్నారు. సీఎం ధరించిన వాచ్‌కు సంబంధించిన ఫొటోలను విడుదల చేసిన సందర్భంలో మీడియాలో వాటిని చూసిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ సుధాకర్ శెట్టి తన స్నేహితుని ద్వారా తనను సంప్రదించేందుకు ప్రయత్నించారు. సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్ తన ఇంట్లో చోరీకి గురైన వాచ్ అని, స్వయంగా కలిసి అన్ని వివరాలను చెబుతానని అన్నారు.

2015 జూలై 7న బెంగళూరులోని కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ శెట్టి తన ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు చేశారని కూడా చెప్పారు. ఈ ఫిర్యాదులో రెండు రోలెక్స్ వాచ్‌లు, ఓ వజ్రాలు పొదిగిన వాచ్‌తో పాటు కొన్ని బంగారు, వజ్ర ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వివరించారు. ఇక లగ్జరీ వాచ్ విషయమై సీఎం సిద్ధరామయ్య చెబుతున్న మాటలు కట్టు కథల్లా అనిపిస్తున్నాయని విమర్శించారు. నిజంగానే సిద్ధరామయ్య ప్రాణస్నేహితుడు ఆ వాచ్‌ను బహూకరించి ఉంటే ఆ విషయం చెప్పడానికి సీఎం ఇన్ని రోజులు ఎందుకు వేచి చూశారంటూ కుమారస్వామి ప్రశ్నించారు.  

కుమారస్వామి పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ  సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. అధికారపక్షంపై చవకబారు ఆరోపణలు చేయడం కుమారస్వామికి అలవాటేనన్నారు. ఈ వాచ్‌కు సంబంధించిన వివరాలను నేను ఇప్పటికే వెల్లడించా. ఈ వాచ్‌పై నా స్నేహితుడు ఇప్పటికే అఫిడవిట్ కూడా ఇచ్చారు.  కుమారస్వామి చెప్పిన సుధాకర్ శెట్టి కూడా ఈ విషయమై స్పందించారు. తమ ఇంట్లో దొంగతనం జరిగి ఖరీదైన వాచ్‌లు పోయిన విషయం నిజమే. అయితే సీఎం సిద్ధరామయ్య ధరించిన వాచ్, మా ఇంట్లో చోరీకి గురైన వాచ్ ఒకటే అనడంలో నిజం లేదని సుధాకర్ శెట్టి స్పష్టం చేశారు.    

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siddaramaiah  rolex  Rahul Gandhi  Karnataka  Janata Dal  HD Kumaraswamy  

Other Articles