YS Jagan slams AP CM Chandrababu Naidu

Ys jagan slams ap cm chandrababu naidu

Jagan, Chandrababu, AP, YSRCP, Bhuma Nagi Reddy, YSR Congress, TDP

YS Jagan slams AP CM Chandrababu Naidu He said people and god will show the Justice on Every thing

చంద్రబాబు గూబ గుయ్ మనిపిస్తారు: జగన్

Posted: 02/24/2016 09:43 AM IST
Ys jagan slams ap cm chandrababu naidu

చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సొంత కుటుంబ సభ్యులనుకున్న భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లొంగకుండా ఉన్న 62 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ చెప్పారు జగన్. ప్రజలు నిలదీస్తే… వారే సమాధానం చెప్పాలి. తనను తప్ప అందర్నీ చంద్రబాబు ప్రలోభాలు పెట్టారన్నారు. నిసిగ్గుగా వ్యవహరించారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. “చంద్రబాబు జీవితమంతా దొడ్డిదారిన వెళ్ళారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని జగన్ వెల్లడించారు.

1అట్టహాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడుకు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. సర్కార్ మూడో సంవత్సరంలోకి వస్తే… టీడీపీ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి క్యూ కడతారని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎంపీలకు సంబంధించిన ఉపఎన్నికలు కచ్చితంగా వస్తాయని.... తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేవుడు చూస్తున్నాడు.. ప్రజలు, దేవుడు.. చంద్రబాబుకు గూబ గుయ్యిమనిపిస్తారు అని అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా న్యాయం చేస్తామన్నారని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Chandrababu  AP  YSRCP  Bhuma Nagi Reddy  YSR Congress  TDP  

Other Articles