Death threat to KCR by an anonymous internet caller

Death threat to kcr by an anonymous internet caller

KCR, Death Threat to KCR, Vidyasagar Rao, Telangana CM KCR

Death threat to KCR by an anonymous internet caller Korutla MLA Vidyasagar Rao got a internet call which death threat to KCR

కేసీఆర్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

Posted: 02/24/2016 09:00 AM IST
Death threat to kcr by an anonymous internet caller

తెలంగాణ సిఎం కేసీఆర్ ను చంపేస్తామంటూ వచ్చిన ఫోన్ కాల్ తీవ్ర కలకలాన్ని రేపింది. పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ చెల్లెలి పెళ్లికి వస్తున్న సీఎం కేసీఆర్‌ను చంపేస్తామంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు నెట్‌ఫోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పశువైద్య కళాశాల భవన ప్రారంభోత్సవం నేడు జరగనుంది. ఎంపీ కవితతో పాటు మంత్రి పోచారం ఈ కార్యక్రమానికి రానున్నారు.

అయితే, ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. ఈ సమయంలో ఆయన సెల్‌కు నెట్ నంబరు నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే అవతలి వ్యక్తిపై మండిపడ్డారు. పక్కనే ఉన్న ఎస్సై బాబురావుకు ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నారు. ఫోన్ చేసిన అపరిచితుడు ఎస్సైతోనూ అదేవిధంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయాన్ని వెంటనే జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అపరిచిత వ్యక్తి ఫోన్‌కాల్ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ను చంపేస్తామన్న కాల్ మీద ఓ వైపు విచారిణ చేస్తూనే.. భద్రత మీద కూడా అధికారులుు దృష్టిసారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Death Threat to KCR  Vidyasagar Rao  Telangana CM KCR  

Other Articles