Four YSRCP MLAs one MLC joins TDP Shock to Jagan

Four ysrcp mlas one mlc joins tdp shock to jagan

YSCRP, MLA, MLC, TDP, Kurnool, kadapa

Four YSR Congress Party ( YSRCP ) MLAs Bhuma Nagi Reddy, Akhila Priya, Adinarayana Reddy, Jaleel Khan and one MLC Narayana Reddy join Telugu Desam party in presence of AP CM and TDP Chief Chandrababu Naidu in Vijayawada today. Its really very big shock to YSRCP Chief Jagan Mohan Reddy who presently in Delhi to meet PM Modi.

టిడిపిలో చేరిన భూమా... టిడిపిలోకి 4గురు ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ

Posted: 02/23/2016 08:39 AM IST
Four ysrcp mlas one mlc joins tdp shock to jagan

జాతీయ పార్టీగా అవతరించాక... తెలంగాణలో బలహీనపడ్డ టీడీపీ.. ఏపీలో బలోపేతమవుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ తో వైసీపీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుంది. ఒకే రోజు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి టీడీపీ తీర్థం ఇచ్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. వైసీపీకి గుడ్ బై చెప్పిన వారంతా నియోజకవర్గాల అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే చంద్రబాబుకు అండగా ఉండేందుకు టీడీపీలో చేరామన్నారు. జగన్ వైఖరిపై ఆదినారాయణరెడ్డి మండిపడితే.., వైసీపీకి ఫ్యూచర్ లేదని భూమా నాగిరెడ్డి జోస్యం చెప్పారు.

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే అయిన భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియా రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు ఎంతో సన్నిహితులు. అలాంటి నేతలు టీడీపీలో చేరకుండా ఇటీవల వైసీపీ కీలక నేతలు చేసిన మంతనాలు ఫలించలేదు. ఏపీలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వర్కవుట్ అయ్యింది. వారం పాటు జోరుగా ఊహాగానాలతో పాటు ఎడతెరిపి లేని చర్చలకు తావుతీసిన రాజకీయ పరిణామాలు సోమవారం ఒక్కసారిగా వేడెక్కాయి.

తొలుత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవికి భూమానాగిరెడ్డి రాజీనామా చేయడంతోనే ఆయన టీడీపీలో చేరడం ఖాయమనేది స్పష్టమైపోయింది. హైదరాబాద్ లో రిజైన్ లెటర్ ఇచ్చాక నేరుగా ఏపీ రాజధానిలోని సీఎం గెస్ట్ హౌజ్ కు భూమా నాగిరెడ్డి కూతురు అఖిలతో కలసి వెళ్లారు. మరోవైపు కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అయిన నారాయణరెడ్డి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంతా చంద్రబాబు కోసం వేచి చూసిన ఆయన వచ్చాక చర్చలు జరిపారు. అంతకుముందు ఆయా నియోజకవర్గాల టీడీపీ నేతలు, కీలక కార్యకర్తలతో సుదీర్ఘంగా మంతనాలు చేశారు చంద్రబాబు. సుదీర్ఘ చర్చలు, మంతనాల తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి కండువాలు కప్పుతూ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSCRP  MLA  MLC  TDP  Kurnool  kadapa  

Other Articles