31 rupees profit on each freedom251 phone sold

31 rupees profit on each freedom251 phone sold

Freedom251, 251Smart phone, Freedom, ringing Bells, Mohit Goel

After the launch of the cheapest smartphone in India, there is widespread scepticism surrounding the jaw dropping price of Freedom 251. Mohit Goel, who launched the phone, faced visits by police and income tax officials at his office and lot more. But he claims that he not only will deliver the phones at the price he has quoted, but the company will also earn a profit of Rs 31 on each handset sold.

ఫ్రీడం251 తో కంపెనీకి 31 రూపాయల లాభం

Posted: 02/22/2016 11:56 AM IST
31 rupees profit on each freedom251 phone sold

ఒకే ఒక్క ప్రకటన దేశం మొత్తం కుదిపేసింది. ప్రపంచం మొత్తం ఆ ఒక్క ప్రకటన గురించే మాట్లాడుకుంది. కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని.. అది కూడా అదిరిపోయే ఫీచర్లతో అందిస్తున్నట్లు రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించింది. అయితే దీని మొత్తం విమర్శకులు పలురకాల విమర్శలు చేశారు. అసలు స్మార్ట్ ఫోన్ ఆ ధరకు తయారు చెయ్యడం కుదరదని అదంతా మోసం అని ఎద్దేవా చేశారు. అంతేకాదు రింగింగ్ బెల్స్ కంపెనీపై కేంద్ర టెలికాం శాఖ విచారణకు కూడా ఆదేశించింది. ఇంత జరుగుతున్నా రూ.251 కే ఏప్రిల్ 15 నుంచి స్మార్ట్ ఫోన్లను అందించి తీరుతామని రింగింగ్‌ బెల్స్ డైరెక్టర్‌ మోహిత్ గోయల్‌ బల్లగుద్ది చెబుతున్నారు. అంత చౌకధరకు స్మార్ట్ ఫోన్ ని అందిస్తున్నా ప్రతిఫోన్ పై తమకు 31రూపాయల లాభం వస్తుందని లెక్కలు వేసి మరీ చూపిస్తున్నారు.

మొదటి విడతగా 25 లక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆమోదిస్తామని,  మరో 25 లక్షల ఫోన్లు ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లకు జూన్ 30లోపు అందజేస్తామని తెలిపారు. ఆన్ లైన్ కోనుగోలుదారుల నుంచి వచ్చిన డబ్బును అలాగే ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని, ఫోన్లు డెలివరీ చేసిన తర్వాతే ఆ డబ్బు తీసుకుంటామని  గోయల్ స్పష్టం చేశారు. తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే  'ఫ్రీడం 251' గురించి ప్రకటించామని, నైతిక విలువలతో కూడిన వ్యాపారమే చేస్తున్నామని గోయల్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Freedom251  251Smart phone  Freedom  ringing Bells  Mohit Goel  

Other Articles