CBI files case against Ex CBI Director's son

Cbi arrests its former director s son

Former CBI Director's Son Arrested by CBI, vijayarama rao, cbi director, chennai, hyderabad, srinivas kalyan rao, cbi, vijayaramarao, cbi case, srinivas kalyanbabu

A case has been registered against former CBI Director Vijaya Rama Rao's son Srinivas Kalyan Rao.

తండ్రి ఆ శాఖ మాజీ డైరెక్టర్.. కుమారుడు నిందితుడు..

Posted: 02/21/2016 01:45 PM IST
Cbi arrests its former director s son

కరుడు గట్టిన నేరగాళ్లు నుంచి వైట్ కాలర్ నేరాలకు పాల్పడే నేరగాళ్ల వంట్లో వణుకుపుట్టించే స్వయం ప్రతిపత్తిగల నేరపరిశోధనా సంస్థ సిబిఐ. ఆ సంస్థ అత్యున్నత పదవి డైరెక్టర్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన వ్యక్తి తనయుడిపై ఆ శాఖే కేసు నమోదు చేసింది. అంతేకాదు రేపు అరెస్టు చేసి నిందితుడిగా కూడా మర్చనుంది. పూలు అమ్ముకున్న చోటే కట్టెలు అమ్ముకున్నట్లు అన్న చందంగా టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి విజయరామారావు పరిస్థి తయారైంది.

విజయరామారావు కుమారుడిపై సీబీఐ కేసు నమోదైంది. కోట్లలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారనే ఆరోపణల కిందట సీబీఐ అధికారులు కేసులు పెట్టారు. మూడు బ్యాంకుల నుంచి విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణ్ రావు రూ.304 కోట్లు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆయా బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో వారు కేసులు నమోదు చేశారు. దీని ప్రకారం ఆయనకు సంబంధించి ఆస్తుల గుర్తింపుకోసం హైదరాబాద్లో, చెన్నైలో చెన్నై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీనావాస్పై సెక్షన్లు 120(బీ), 420, 468, 468, 471 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cbi  vijayaramarao  cbi case  srinivas kalyanbabu`  

Other Articles