Boycott Apple until they give up the information

Boycott apple until they give up the information

donald trump, America, Apple, Apple phones, Boycott Apple

As Donald Trump barreled toward his next test of strength in the Republican nomination fight, the billionaire confronted two top US companies, a popular pope and virtually anyone else in his way.

యాపిల్ ను బహిష్కరించాలంటున్న డొనాల్డ్ ట్రంప్

Posted: 02/20/2016 11:28 AM IST
Boycott apple until they give up the information

ముస్లింల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరో సారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. యాపిల్ ను అందరూ బహిష్కరించాలని డొనాల్డ్ కోరుతున్నారు. సాన్‌ బెర్నార్డినో  కాల్పుల ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్‌ చేసేందుకు యాపిల్‌ కంపెనీ నిరాకరిస్తుండటంతో ఆ కంపెనీ ఉత్పత్తులన్నింటినీ బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. కనీసం అలాంటి సమాచారం ఇచ్చేవరకు యాపిల్‌ సంస్థ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.

కాలిఫోర్నియాలోని సాన్‌బెర్నార్డినో లో భార్య తష్ఫీన్ మాలిక్ తో కలిసి రిజ్వాన్ సయెద్ ఫరుఖ్‌ కాల్పులు జరిపి.. 14 మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా ఫరుఖ్ ఐఫోన్‌ ను అన్‌లాక్‌ చేసి.. అందులోని వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్పించాలని యాపిల్ కంపెనీపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ విషయమై ఎఫ్‌బీఐ కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, ప్రైవసీని దెబ్బతీసే ఇలాంటి చర్యలకు తాము అంగీకరించబోమని యాపిల్ అంటోంది.  తాము దీని మీద కోర్టులో కూడా న్యాయపోరాటానికి సిద్దమే కానీ వివరాలను తెలిపేందుకు మాత్రం సిద్దంగా లేమని యాపిల్ కంపెనీ వెల్లడించింది. కాగా యాపిల్ కు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ లు కూడా బసటగా నిలుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  America  Apple  Apple phones  Boycott Apple  

Other Articles