TeluguDesam party implementing operation Akarsh in Ap

Telugudesam party implementing operation akarsh in ap

AP, Chandrababu Naidu, TDP, YSRCP, Operation Akasha

TeluguDesam party implementing operation Akarsh in Ap. AP CM Chandrababu naidu special care about new joinings.

ఏపిలో టిడిపి ఆపరేషన్ ఆకర్ష్

Posted: 02/16/2016 08:36 AM IST
Telugudesam party implementing operation akarsh in ap

తెలంగాణలో పార్టీని కాపాడుకోవడానికి ఆపోపాలుపడుతున్న చంద్రబాబు నాయుడు ఏపిలో మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్నారు. వరుసగా వైసీపీ నాయకులను టార్గెట్ గా చేస్తూ పావులు కదుపుతున్నారు. రెండు రోజుల క్రితం రోజా టిడిపిలో ఏముందని తమపార్టీ నాయకులు చేరుతారు అని వ్యాఖ్యానించినా కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం తమ పని తాను సైలెంట్ గా చేస్తున్నారు. వ‌చ్చేనెల‌లో జ‌రిగే బ‌డ్జెట్ స‌మావేశాల కంటే ముందే ఆప‌రేష‌న్‌ ఆకర్ష్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నారు చంద్రబాబు. సోమవారం క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగు పార్టీ ఇన్ చార్జ్ రామ‌సుబ్బారెడ్డిని పిలిపించుకుని చంద్రబాబు స‌ర్ది చెప్పారు. పార్టీ బ‌లోపేతం దృష్ట్యా కొంత‌మందిని టీడీపీలో చేర్చుకోవాల్సి వ‌స్తోందని.. దానికి అడ్డుచెప్పకుండా స‌హ‌క‌రించాల‌ని బాబు కోరారు. త్వర‌లో వైసిపి జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణరెడ్డి చేరిక‌కు మార్గం సుగమం అయిన‌ట్లు తెలుస్తోంది. ఇలాగే ఎవ‌రైతే ఎమ్మెల్యేల రాక‌ను వ్యతిరేకిస్తున్నారో వారంద‌రికీ మ‌రోసారి న‌చ్చచెప్పాల‌ని చూస్తున్నారు చంద్రబాబు.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌పై వారం రోజులుగా చంద్రబాబు ప్రత్యేక ఫోక‌స్ పెట్టారు. నాలుగు రోజుల క్రితం లోకేష్‌, య‌న‌మ‌లతో ప్రత్యేకంగా స‌మావేశమయ్యారు.  మరోసారి చంద్రబాబు నాయుడు  ఎపి టిడిపి అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు, లోకేష్, మంత్రుల‌తో ప్రత్యేకంగా స‌మావేశం నిర్వహించారు. జిల్లాల వారిగా ఆసక్తి  ఉన్న నేత‌లు ఎవ‌రనేదానిపై ఆరాతీశారు చంద్రబాబు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కొణ‌తాల రామకృష్ణ, అర‌కు వైసిపి ఎమ్మెల్యే టీడీపీలో చేర‌డానికి సిద్దంగా ఉన్నారు. కృష్ణా  జిల్లాలో ముగ్గురు ప్రతిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు టిడిపి నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున క‌ర్నూల్ జిల్లాలో మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మార‌డానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే వారిని పార్టీలో చేర్చుకునే స‌మ‌యంలో ఎంతోకాలంగా పార్టీకి సేవ‌లందిస్తున్నవారిని సముదాయించాకే ఈ నిర్ణయం తీసుకోవాల‌ని భావిస్తున్నారు చంద్రబాబు. పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా కొన్ని క‌ఠిన నిర్ణయాలు తీసుకోక త‌ప్పద‌ని, దానికి స‌హ‌క‌రించాల‌ని మంత్రుల‌కు, సీనియర్లకు సర్ధిచెప్పారు. ఎవరొచ్చినా కలిసి పనిచేయాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  TDP  YSRCP  Operation Akasha  

Other Articles